Sudheer Rashmi Love Story బుల్లితెర వీక్షకులకి సుధీర్ – రష్మిల ఆన్ స్ర్కీన్ ప్రేమాయణం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమికులా.? అనే ప్రశ్న ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంటుంది. ఆన్ స్ర్కీన్ రొమాన్స్ విషయంలో ఇద్దరూ చెలరేగిపోతారు. కానీ, ఆఫ్ స్ర్కీన్ ఈ ఇద్దరికీ మధ్య సరైన స్నేహం కూడా ఉండదట.
‘మేం నటులం, నటిస్తాం.. అంతే అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. సినిమాల్లో హీరో, హీరోయిన్ల రొమాన్స్ ఎలాంటిదో.. స్టేజ్ మీద మేం చేసేది కూడా అలాంటిదే..’ అని వీలు చిక్కినప్పుడల్లా సుధీర్, రష్మి చెబుతూనే ఉంటారు. కానీ, వాళ్లేం చెప్పినా సరే, వాళ్ల చుట్టూ ‘పెళ్లి గోల’ ఊహాగానాలు వైఫైలా ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాయ్.
Also Read: యూ ట్యూబర్స్.. సిగ్గూ ఎగ్గూ వదిలేశారంతే.!
సుధీర్ – రష్మి మధ్య ఈ రొమాంటిక్ బుల్లితెర ప్రేమాయణం వీక్షకులకి మాంచి కిక్ ఇస్తోంది. అందుకే, ఎప్పటికప్పుడు వీళ్ల మీద స్సెషల్ స్కిట్స్, స్పెషల్ డాన్సులు, స్పెషల్ ప్రోగ్రాములు డిజైన్ చేస్తుంటారు. అన్నింటికీ మించి, ‘మీ ఇద్దరి మధ్యా ఏదో ఉంది.. అదేంటో మాక్కొంచెం చెప్పరూ..’ అని పదే పదే ఆయా ప్రోగ్రామ్‌లలో జడ్జిలుగానో, అతిధులుగానో వచ్చే సెలబ్రెటీలు అడిగేస్తుంటారు నాటకీయంగా.

అలా వచ్చే ప్రశ్నలు స్ర్కిప్టెడ్ అని తెలిసి, సుధీర్, రష్మి సిగ్గుతో మెలికలు తిరుగుతన్నట్లు తెగ నటించేస్తుంటారు. ఓ విషయంలో సుధీర్, రష్మిలను అభినందించి తీరాలి. వెండితెరపై ఓ హీరోయిన్, ఓ హీరో వరుసగా రెండు, మూడు సినిమాల్లో నటిస్తే, ఆ జంట బోర్ కొట్టించేస్తుంది. కానీ, ఈ బుల్లితెర రొమాంటిక్ పెయిర్ అస్సలు బోర్ కొట్టించరు. అందుకే ఏళ్ల తరబడి ఈ బుల్లితెర ప్రేమాయణం కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంటుంది.
Also Read: అందం.. అనసూయ.. ఆత్మవిశ్వాసం.!
అన్నట్టు, సుధీర్ – రష్మి మాత్రమే కాదు.. చాలా కాంబినేషన్లు ఇలాంటివి వున్నాయి. వాటిల్లో చాలావరకు ఇలా వచ్చి, అలా మాయమైపోయేవే. అన్నిటికీ దాదాపుగా ఒకటే స్క్రిప్ట్. కానీ, రష్మి – సుధీర్‌ల మధ్య వర్కవుట్ అవుతున్నట్టుగా ఈ బుల్లితెర ప్రేమాయణం ఇతరులెవరి మీదా వర్కవుట్ అవడంలేదు.
ఏదో మ్యాజిక్ వుంది రష్మి – సుధీర్ కాంబినేషన్‌లో. ఆ మ్యాజిక్ వర్కువట్ అవుతున్నంతకాలం.. ఈ ఇద్దరి నుంచీ చాలా చాలా ప్రేమ కథలు.. బుల్లితెరపై రకరకాల రూపాల్లో కనిపిస్తుంటాయంతే.