ఏ విషయంలో అయినా నిక్కచ్చిగా మాట్లాడేయడం తన స్టయిల్ అని చెబుతుంటుంది నటి తాప్సీ (Taapsee Pannu Rhea Chakraborty). కానీ, రియా చక్రవర్తి విషయంలో ఎందుకో తాప్సీ చెబుతున్న మాటలు అస్సలేమాత్రం సబబుగా అనిపించడంలేదు. రియా చక్రవర్తి ఎవరో తాప్సీకి తెలియదంటే ఎవరైనా నమ్మగలరా? ఛాన్సే లేదు.
రియా చక్రవర్తి బాలీవుడ్ నటి. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. తాప్సీ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లోనూ ఓ మోస్తరు స్టార్‌డవ్‌ు సంపాదించుకుంది. బాలీవుడ్‌లో పార్టీ కల్చర్ చాలా ఎక్కువ. ఏ పార్టీలో అయినా రియా చక్రవర్తి, తాప్సీ కలుసుకునే అవకాశం వుంటుంది.
పోనీ, పార్టీల్లో కాకపోతే సినిమా ఫంక్షన్లలో కలుసుకోవచ్చు. అదీ కాదంటే, ఏదన్నా అవార్డ్స్ ఈవెంట్ కూడా అనేకమంది తారల్ని కలుపుతుంటుంది. కానీ, రియా చక్రవర్తి గురించి తనకేమీ తెలియదనీ, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాలనీ తాప్సీ విజ్ఞప్తి చేస్తోంది. అసలు విషయం వేరు.
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి జరుగుతున్న అన్యాయంపై తాప్సీ గళమెత్తింది. దాంతో, తాప్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా, రియా చక్రవర్తిని దోషిగా తేల్చేస్తూ తెరపైకి తెస్తున్న కథనాల పట్ల తాప్సీ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే.
ఇంతకు ముందెన్నడూ ఏ నటికీ ఇలాంటి పరిస్థితి రాలేదన్నది తాప్సీ వాదన. కానీ, గ్లామర్ ప్రపంచంలో చాలామందికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. తాప్సీ కూడా పలు మార్లు తీవ్రాతి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. అయితే, డ్రగ్స్ – పోలీసు కేసుల వంటి వ్యవహారాలు కావవి.
నిజమే, రియా చక్రవర్తి విషయంలో మీడియా అత్యుత్సాహమే చూపింది. కానీ, ఆధారలుండబట్టే కదా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. తాప్సీ వాదనలో కొంత నిజం వుంది, కొంత గందరగోళం కూడా వుంది.
రియాకి సాటి మహిళగా తాప్సీ మద్దతివ్వడాన్ని తప్పుపట్టలేం. కానీ, రియా చక్రవర్తి ఎవరో తనకు తెలియదంటే ఎలా.? అసలు ఈ వివాదంలో తలదూర్చి, తాప్సీ ఏం లబ్ది పొందాలనుకుంటోందో ఏమో.! పబ్లిసిటీ స్టంట్ చేయబోయి బొక్క బోర్లా పడింది తాప్సీ.. అని అంతా అనుకోవాల్సి వస్తోందిప్పుడు.