Taapsee Pannu బాలీవుడ్‌లో గత కొంతకాలంగా తాప్సీకీ, కంగనా రనౌత్‌కీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
తాప్సీని బి-గ్రేడ్ నటిగా కంగన పలుమార్లు అభివర్ణించింది. ప్రేక్షకులు ఇచ్చే సర్టిఫికెట్లను గౌరవిస్తాను తప్ప, గాలి మాటల్ని తాను పట్టించుకోనంటూ అప్పట్లో కంగనాకి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది తాప్సీ.
ఆ వివాదం చల్లారలేదు. తరచూ కంగన వర్సెస్ తాప్సీ.. సోషల్ మీడియా వేదికగానో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారానో.. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరుగుతూనే వుంటుంది.
Taapsee Pannu.. వాళ్ళలా నటించలేనంటున్న తాప్సీ..
కొందరు కెమెరాల ముందూ, కెమెరాల వెనుకా నటిస్తుంటారనీ, అలాంటి నటన తనకు చేతకాదని తాప్సీ చెప్పుకొచ్చింది.
‘నేను మాట్లాడే ప్రతి మాటనీ వివాదాస్పదం చేయాలని కొందరు అనుకుంటుంటారు.. వారిలా నాకు నిజ జీవితంలో నటించడం చేతకాదు..’ అని తాప్సీ మండిపడింది.
Also Read: రష్మికకి షాక్.! డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.!
ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా, ‘బాయ్‌కాట్ ట్రెండ్’ మీద మీడియా ప్రశ్నలు సంధిస్తే, ‘ఏ సినిమాని బాయ్‌కాట్ చేయడంలేదు చెప్పండి.?’ అంటూ ఎదురు ప్రశ్నించింది తాప్సీ.

తాప్సీ వ్యాఖ్యలపై కంగన (Kangana Ranaut) గుస్సా అయ్యింది. తాప్సీ మీద అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది కంగన.
ఆ వ్యవహారంపైనే, ‘నాకు తెర మీద నటించడం మాత్రమే వచ్చు.. మీడియా ముందు నటించడం రాదు. వున్నది వున్నట్లు చెబుతానంతే..’ అని తాప్సీ వివరణ ఇచ్చినట్లే ఇచ్చి.. కంగనకి సెటైర్ వేసిందన్నమాట.