ఆకాశంలో సగం.. అన్నింట్లోనూ సగం.! మహిళ గురించి మాట్లాడేటప్పుడు తరచూ ఈ మాట వింటుంటాం. నిజమే, దేంట్లోనైనా పురుషులతో సమానంగా.. ఆ మాటకొస్తే, ఇంకాస్త సమర్థవంతంగా రాణించగలరు మహిళలు. మరి, ‘అందాల ప్రదర్శన’ (Taapsee Pannu Hot And Spicy Question) పరిస్థితేంటి.?
అసలు ఇలాంటి ప్రశ్నలు ఎలా పుట్టుకొస్తాయ్.? ఏమో మరి, తాప్సీకి ఇలాంటి ధర్మ సందేహాలు చాలా తేలిగ్గా వచ్చేస్తుంటాయి. మహిళా పక్షపాతి అయిన తాప్సీ.. సాటి మహిళలకు అన్ని రంగాల్లోనూ అగ్ర తాంబూలం దక్కాలని కోరుకోవడంలో వింతేమీ లేదు.
కానీ, వెండితెరపై అంగాంగ ప్రదర్శన అనేది హీరోయిన్లకే సొంతం. అలాగని హీరోలు తక్కువేమీ కాదు. సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపించడంలో మన హీరోలు మహా ఘనులు. అయినాగానీ, పక్కన హీరోయిన్ చూపించే గ్లామర్ తక్కువైతే.. ఏదో వెలితి.

సినిమాల్లో హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేస్తే, చొంగ కార్చుకునేవాళ్ళలో చాలామంది, ఆ అందాల విందుని కళ్ళతోనే థియేటర్లలో ఆరగించేసి.. బయటకొచ్చాక విమర్శిస్తుంటారు. దీనిపైనే తాప్సీకి అభ్యంతరం. హీరోల విషయంలో ఎందుకలా మాట్లాడరు.? వాళ్ళు చేస్తున్నది కూడా అందాల ప్రదర్శనే కదా.? అని ప్రశ్నించేసింది.
అద్గదీ అసలు సంగతి. హీరోలు చొక్కాలు విప్పితే.. దానికి సెన్సార్ వుండదు. అదే హీరోయిన్ గనుక ఆ పని చేస్తే ఇంకేమన్నావుందా.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఈ విషయంలో పురుషుడు వేరు, స్త్రీ వేరు (Taapsee Pannu Hot And Spicy Question). మన భారతీయ సమాజంలో ఇంకా కొన్ని విలువలున్నాయ్.. ఆ విలువల వలువల్ని ఆల్రెడీ కొందరు వలిచేశారు.. వదిలేశారు.
సోషల్ మీడియాలోనూ ప్రత్యేకమైన ‘యాప్’ల సాయంతోనూ నగ్నంగా అన్నీ చూపించేస్తున్నా.. అవీ సర్వసాధారణమైపోయే రోజులు వచ్చేస్తాయేమో.!