Tabbareddy Bharadwaja Nagababu RRR ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
ఆస్కార్ పురస్కారం కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి.
అయితే, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఈ విషయమై ఇంతవరకు స్పందించలేదు. కానీ, మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తీవ్ర స్థాయిలో స్పందించారు.
‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ కోసం..’ అంటూ నాగబాబు ప్రశ్నించారు. ‘ఆర్ఆర్ఆర్ మీద కామెంటుకి వైసీపీ వారి భాషలో సమాధానం’ అంటూ నాగబాబు పేర్కొన్నారు.
Tabbareddy Bharadwaja Nagababu RRR ఎవరూ ఊహించని స్పందన ఇది.!
నాగబాబు నుంచి నిజంగానే ఊహించని సమాధానం ఇది. ఇంత ఘాటుగా నాగబాబు స్పందిస్తారని ఎవరూ ఊహించలేదు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత దానయ్యగానీ, దర్శకుడు రాజమౌళిగానీ ఇప్పటివరకు తమ్మారెడ్డి విమర్శలపై స్పందించకపోగా, నాగబాబు ఎందుకు స్పందించారన్నది చర్చనీయాంశంగా మారింది.

‘ఎవరూ ఊహించని ఓ చక్కటి షాట్‌తో సిక్స్ కొట్టి ఆటను ముగించారు’ అంటూ కొందరు ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు, నాగబాబుని అభినందిస్తున్నారు.
పరిశ్రమలో పెద్ద తలకాయ్.. అన్న ముసుగులో అడ్డగోలు వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులపై తమ్మారెడ్డి భరద్వాజ చేస్తుంటారు.
తమ్మారెడ్డికి ఏం తెలుసు.?
రాజకీయాలపైనా అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం తమ్మారెడ్డి భరద్వాజకి కొత్తేమీ కాదు. కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత మీద తమ్మారెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ అవార్డుల ముంగిట నిలిచింది. ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ దక్కేలానే వుంది.
‘ఆస్కార్’ అంటే మాటలు కాదు. దీనికోసం చాలా చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. అంతర్జాతీయ సమాజం ముందర సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సి వుంటుంది.
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గత కొన్ని నెలలుగా ‘ఆస్కార్’ కోసం అవసరానికి మించి కూడా కష్టపడుతోందన్నది నిర్వివాదాంశం.
ఇదంతా ఓ తెలుగు సినిమాకి, ఓ ఇండియన్ సినిమాకి అరుదైన గౌరవం తీసుకురావడం కోసం. దురదృష్టం తమ్మారెడ్డి లాంటోళ్ళు అర్థం పర్థం లేని ప్రేలాపనలు పేలుతుంటారంతే.