ఇదీ టీమిండియా అసలు సిసలు సత్తా.! నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బంపర్ విక్టరీ సాధించింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లు కనీసం 100 పరుగులు కూడా చతికిలపడ్డారు సెకెండ్ ఇన్నింగ్స్‌లో.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా..
మొదటి ఇన్నింగ్స్‌లోనే కాస్త బెటర్.. రెండో ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా ఆడారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. నిజానికి, టీమిండియా బౌలింగ్ మరింత పదునుగా సాగిందని చెప్పొచ్చేమో.
అశ్విన్ ఐదు వికెట్లు, జడేజా రెండు వికెట్లు, షమి రెండు వికెట్లు, అక్సర్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో కేవలం 91 పరుగులకే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది.
టీమిండియా బ్యాటింగ్ విషయానికొస్తే, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. అక్సర్ పటేల్, రవీంద్ర జడేజా అర్థ సెంచరీలు కొట్టారు. ఆస్ట్రేలియా బౌలర్ మర్ఫీ ఏకంగా ఏడు వికెట్లు తీశాడు ఒకే ఇన్నింగ్స్‌లో.
Also Read: Nikki Tamboli.. పెళ్ళి కళ వచ్చేసిందే బాలా.!
ఓ దశలో టీమిండియా కూడా తక్కువ స్కోరుకే ఆలౌటవుతుందని అంతా అనుకున్నారు.
కానీ, చివర్లో జడేజా, అక్షర్ పటేల్, షమీ.. ఆస్ట్రేలియా బౌలర్లను విసిగించారు.. టీమిండియా స్కోరుని 400 పరుగులకు చేర్చారు.
టీమిండియా ఇన్నింగ్స్ చివర్లో షమీ బాదిన మూడు భారీ సిక్సర్లు వెరీ వెరీ స్పెషల్ అంతే.