Telangana Local Elections Reservations.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు ‘అదనపు’ రిజర్వేషన్లు కల్పిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.
ఉన్నత న్యాయస్థానం, రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని, సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది.
రాజకీయ కోణంలో, నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లను పెంచేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నమే అర్థం లేనిదన్న విషయం స్పష్టమైపోయిందిక్కడ.
అయినాగానీ, రాజకీయ పార్టీలు రోడ్డెక్కాయి.. తెలంగాణలో బంద్ నిర్వహించేశాయి. ఈ బంద్ సందర్భంగా, ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకున్నారు.
Telangana Local Elections Reservations.. వారసుడి పొలిటికల్ ఎంట్రీ..
ఓ ప్రజా ప్రతినిథి వారసుడు, ఈ బంద్ నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.. ప్లకార్డు పట్టుకుని ఏదేదో మాట్లాడేశాడు. పసి పిల్లాడు కదా, పుసుక్కున ఏమీ అనలేం.
కాకపోతే, రాజకీయాన్నాక విమర్శలు సహజం. ట్రోలింగ్‌కి ఎవరూ అతీతం కాదు. గట్టిగానే ఆడేసుకున్నారు, సదరు ‘చోటా రాజకీయ నాయకుడి’ని.!
అతనెవరో కాదు, భారత రాష్ట్ర సమితి (ఒకప్పటి టీఆర్ఎస్) నుంచి ఇటీవల గెంటివేయబడ్డ కవిత కుమారుడు. కవిత కూడా, ఈ రోజు బంద్‌లో పాల్గొన్నారనుకోండి.. అది వేరే సంగతి.
రిజర్వేషన్ల విషయమై ఎక్కడ పోరాాటం చేయాలి.? నిబంధనలకు మించి, రిజర్వేషన్ల శాతం పెంచాలంటే, ఏం చేయాలి.? ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలియనివి కావు.
పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప, రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, చేతులు దులుపుకోవడంతోనే, రేవంత్ సర్కార్ చిత్తశుద్ధి ఏంటో అర్థమయిపోయింది.
ఎటూ, ఈ రిజర్వేషన్ల పెంపకం అనేది జరగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. స్థానిక ఎన్నికల ముందర ఆదరాబాదరాగా, రిజర్వేషన్లను పెంచేయడం, ఓటు బ్యాంకు రాజకీయమే.
నలుగురూ నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లే వుంటుంది రాజకీయ నాయకుల వ్యవహారం. నిజానికి, స్థానిక ఎన్నికలంటేనే ఓ ప్రసహనం.
స్థానిక ఎన్నికల వేళ పద్ధతీ పాడూ.. ఏమీ వుండవ్. డబ్బున్నోడిదే రాజకీయం. అధికారం వున్నోడిదే రాజకీయం.
రాజకీయ ప్రత్యర్తులు, నామినేషన్లు వేసే పరిస్థితి కూడా లేకుండా చేస్తాయి అదికారంలో వున్న పార్టీలు. ఇంతా చేసి, బీసీల మీద ప్రేమంటే ఎలా.?
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
బీసీ లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఎవరన్నా స్థానిక ప్రజా ప్రతినిథులుగా గెలిచినా, గెలిచిన చోట్ల పెత్తనం ‘పలుకుబడి వున్న అగ్ర కులాలదే’ అన్నది ఓపెన్ సీక్రెట్.
ఇదొక నిరంతర ప్రక్రియ.! తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా ఇదే తంతు జరుగుతుంది. అందుకే, బీసీ రిజర్వేషన్లు.. బంద్ వ్యవహారం.. ఇదంతా రాజకీయ పాతివ్రత్యంలో భాగంగా జరుగుతున్నవేనని అనేది.!
రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి వుంటే.. చట్టంతో పనేంటి.? స్వచ్ఛందంగా 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పించేలా, వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వొచ్చ కదా.?
