Table of Contents
Telugu Cinema Bandh.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ‘గ్లోబల్ సినిమా’ అంటున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్‌లకు ఈ సినిమా ‘గ్లోబల్ స్టార్స్’ హోదా తెచ్చిపెట్టింది.
బాలీవుడ్, కోలీవుడ్ కూడా తెలుగు సినిమాని చూసి ఒకింత కుళ్ళుకున్న పరిస్థితుల్ని చూశాం. కానీ, ఇప్పుడు అందరూ తెలుగు సినీ పరిశ్రమని చూసి నవ్వుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది.?
తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు బంద్ అట.! అలాగని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీర్మానించింది. పెరుగుతున్న వ్యయాలు తగ్గుతున్న సక్సెస్ రేట్.. వెరసి, తెలుగు సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొంది.
తప్పు ఎవరిది.? శిక్ష ఎవరికి.?
ఔను, సినిమా నిర్మాణం పెరిగింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పాన్ ఇండియా సినిమాలు, గ్లోబల్ సినిమాలు తెరకెక్కుతున్నప్పుడు రెమ్యునరేషన్లు పెరిగితే తప్పేంటి.?
ఫ్లాపులు, డిజాస్టర్లు ఎక్కువయ్యాయ్.! అసలు తెలుగు సినిమా సక్సెస్ రేట్ మారిందా.? అత్యంత దారుణంగానే వుందా.? ఇదీ ఆలోచించాల్సిన విషయమే.
Also Read: అమ్మాయిలూ.! ఓ అబ్బాయిలూ.! అది తప్పు కదా.?
సక్సెస్ రేటు విషయంలో పెద్దగా మార్పు లేదు. కాకపోతే, సినిమా థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు మునుపటిలా ఇష్టపడటంలేదు. అదే అసలు సమస్య.
సినిమా బాగున్నా, బాగాలేకున్నా.. థియేటర్లు వెలవెలబోతున్నాయ్.!
ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, ముందుగా ఆ సినిమాని చంపెయ్యడానికి కుట్రలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఇక్కడ కీలక భూమిక పోషిస్తోంది.

ఆయా హీరోల అభిమానుల పేరుతో కొన్ని శక్తులు, తెలుగు సినిమా పతనాన్ని కోరుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు కూడా ఈ పాపంలో భాగం పంచుకోవాల్సిందేనేమో.!
అభిమానులు రెచ్చిపోతోంటే, సెలబ్రిటీలు ఆ పిచ్చి అభిమానాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు.?
Telugu Cinema Bandh.. ఖర్చు పెరిగితే తప్పెవరిది.?
రెమ్యనరేషన్లు పెంచేస్తున్నారు సరే, కథలో క్వాలిటీ లేకపోవడంపై నిర్మాతలెందుకు శ్రద్ధ పెట్టలేకపోతున్నారన్నదీ కీలకమైన పాయింటే.
రెమ్యునరేషన్ పెంచేసుకుంటున్న నటీనటులు, దర్శకులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కానీ, అది జరగడంలేదు. కాంబినేషన్, క్రేజ్, పెయిడ్ పబ్లిసిటీ.. వీటి చుట్టూనే కథ నడుస్తోంది.
Also Read: చిరంజీవిపై ఎర్ర పుష్పం వెర్రి కూతలు.! పేటీఎం పైత్యమే.?
ఒక్క మాటలో చెప్పాలంటే, మందు లేని రోగమిది.. అన్నట్టు తయారైంది వ్యవహారం. తెలుగు సినిమా గురించి బయట అంతా పొగుడుతోంటే, తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం బిక్కచచ్చిపోతోంది.!
రోడ్డున పడ్డ తెలుగు సినీ పరిశ్రమ మళ్ళీ తలెత్తుకు తిరిగేదెప్పుడో.. ఏమో.!
చివరగా.. ‘తెలుగు సినిమాని చూసి చాలా నేర్చుకుంటున్నాం..’ అని బాలీవుడ్ ప్రముఖులే కాదు, ప్రపంచ స్థాయి సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్న వేళ, ప్రపంచ సినిమాకి ‘తెలుగు సినిమా షూటింగుల బంద్’తో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం.?