Telugu Cinema Journalism TFJA.. మెగాస్టార్ చిరంజీవిని కలిసింది నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గం.!
అసలు, తెలుగు సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా జర్నలిస్టులు ఎక్కడున్నారు.? అసలు జర్నలిజం ఎక్కడుంది.?
జర్నలిజం గనుక వుండి వుంటే, ఓ సినీ ఎర్నలిస్ట్.. ఓ సినీ నటిని ‘మీకున్న పుట్టుమచ్చలెన్ని.? అన్నిటినీ హీరో చూశాడా.?’ అని ఎలా అడుగుతాడు.?
ఇంకో ఎర్నలిస్ట్, మరో నటి వైవాహిక జీవితానికి సంబంధించి జుగుప్సాకరమైన ప్రశ్నలు పదే పదే ఎలా అడగగలుగుతాడు.?
ఓ మహిళా ఎర్నలిస్ట్, ఓ సినీ నటిని ఉద్దేశించి, అత్యంత అసహ్యకరమైన ప్రశ్నలతో ఎలా వేధించగలుగుతుంది.? ఓ సినీ నటుడ్ని ఉద్దేశించి, హీరో మెటీరియలేనా.? అని ఎలా అనగలుగుతుంది.?
Telugu Cinema Journalism TFJA.. సినీ జర్నలిజమా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
ఇంతా జరుగుతున్నా, తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్.. ఆయా సినీ ఎర్నలిస్టుల్ని ఎందుకు నిలువరించలేకపోతోంది.? ఈ మాత్రందానికి ఓ అసోసియేషన్, దానికి మళ్ళీ కార్యవర్గం కూడా.!
కొత్త కార్యవర్గంలో ఎవరెవరు వున్నారు.? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.? ఎవరికైనా జర్నలిజంకి సంబంధించి ‘ఏబీసీడీలు’ అయినా తెలుసా.? అన్న ప్రశ్నకి సమాధానమెవరిస్తారు.?
మెగాస్టార్ చిరంజీవి అపాయింట్‌మెంట్ ఇచ్చారు.. అన్ని విధాలుగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చిరంజీవి చెప్పారు కూడా.
అది, చిరంజీవి పెద్ద మనసుకి నిదర్శనం. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న అయిన చిరంజీవిని కలిసిన, తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్, ఇకనైనా బాధ్యతగా నడుచుకుంటుందా.?
ప్చ్.. ఆ ఛాన్సే వుండదు.! ఇక్కడ ఎవడి కుంపటి వాడిదే. సోషల్ మీడియా, వెబ్ సైట్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.. ఇలా ఎవరి గోల వారిదే.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
దాదాపు రెండొందల మంది వరకు కవర్లు అందుకుంటుంటారు, ఏదన్నా ప్రెస్ మీట్ అంటే.! ఐదొందలు, ఆ పైన కవర్లలో సొమ్ములుంటాయ్.!
అవి లేకపోతే, సినిమాకి సంబంధించిన వార్తలే ఎక్కడా వచ్చే పరిస్థితి వుండదు. సినిమా ఏదన్నా వస్తోందంటే, ప్యాకేజీ ఐదు లక్షలంటూ ఓ మీడియా హౌస్, తెగేసి చెబుతుంటుంది.
ఎలా చూసినా, తెలుగు సినిమాకి సంబంధించి జర్నలిజం, జర్నలిస్టులన్న ప్రస్తావనే జుగుప్సాకరం.! ఇక్కడ నడుస్తున్నదంతా యాపారమే.!
