Telugu Cinema Media Vultures నేను హర్ట్ అయ్యాను.! సోషల్ మీడియా నుంచి జంప్.! అన్నీ కలిసొస్తే, మళ్ళీ మిమ్మల్ని వేరేలా కలుసుకుంటాను.!
ఇదండీ వరస.! ఎవడో ఏదో అన్నాడట.! మనోడు హర్టయ్యాడు.! సోషల్ మీడియా నుంచి పారిపోయాడు. పారిపోయేముందు నీతులూ చెప్పాడు.
‘నాలా ధైర్యంగా చెయ్యండి’ అంటూ మేకపోతు గాంభీర్యమూ ప్రదర్శించాడు. కానీ, పారిపోయాడాయె.!
Telugu Cinema Media Vultures.. ఎక్కడకు పోతావు చిన్నవాడా.!
ఎక్కడికీ పోలేదు. పోయినట్టు నటించాడంతే, సోషల్ మీడియా హ్యాండిల్ డీ-యాక్టివేట్ చేశాడు. ఇరవై నాలుగ్గంటలు తిరగకుండానే రీ-యాక్టివేట్ చేశాడు.
సొల్లు మళ్ళీ మామూలే.! యజమానిని బెదిరించాడో, యజమాని కాళ్ళే పట్టేసుకున్నాడో.! ఏదో జరిగింది.
అన్నట్టు, యజమానీ తక్కువోడేం కాదు. ఇద్దరూ కలిసే డ్రామా ఆడినట్టున్నారు. ఒకడి కాళ్ళు ఇంకొకడు పట్టేసుకున్నాడేమో.!
చెప్పేవి డాష్ నీతులు.. దూరేవి డాష్ గుడిసెలు..
బ్లాక్‌మెయిల్.. ఇదే యజమాని, బానిస.. కలిసి చేసే పని.! చేసేది ‘రంకు’ పని.. దానికి మళ్ళీ ‘గ్రేట్ కవరింగ్’.! గ్రేటు దోపిడీ.!
సినీ రంగంలో చాలా చిత్ర విచిత్రాలుంటాయి. అలాంటి సినీ రంగంలో తలపండిపోయినోళ్ళకే కాదు, రాజకీయ రంగంలో తలపండిపోయినోళ్ళు సైతం, ఈ ఊసరవెల్లుల్ని చూసి విస్తుపోతున్నారట.

ఎవడూ ఏమీ అన్లేదు.! అయినాగానీ, నన్నెవరో మూసుక్కూర్చోరా పూలచొక్కా అన్నారనుకుంటూ.. పారిపోయి, తిరిగొచ్చిన ఊసరవెల్లి సినీ రాజకీయం.. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
ఇంతలా దోచేస్తోంటే, బాధితులెవరూ గట్టిగా మాట్లాడరేం.? మాట్లాడినా, ఆ తర్వాత లైట్ తీసుకుంటారేం.?
పెంట మీద రాయేస్తే, మన మీదే పడుతుంది.! ‘ఎవడో సొమ్ములు కొట్టేశాడనుకుందాం.. ఏ సెట్టు కోసమో వృధాగా ఖర్చు చేశామనుకుందాం’ అని లైట్ తీసుకుంటున్నారట బాధితులు.
యజమాని, బానిస.. ఇద్దరూ భలేగా సెట్టయ్యారు.. జనాల జీవితాలతో ఆడుకోవడానికి.!
ఇదీ ఓ బతుకేనా.? మీ ఇంట్లో నీలి సిత్రాల సంగతేంటి.? అని కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఓ సినీ ప్రముఖుడు ప్రశ్నించాడంటే.. అతన్నెంతలా ఈ ‘ఊసరవెల్లులు’ వేధించి వుంటాయో కదా.?