Telugu Cinema Tickets.. సినిమా టిక్కెట్ల రేట్లు సమోసా ధర కంటే తక్కువ వుండాలా.? భరించలేనంత భారంగా వుండాలా.? అతి సర్వత్ర వర్జయేత్.! అసలు సినిమాకి ఏం కావాలో, సినీ జనాలకే తెలియని దుస్థితి వచ్చేసిందాయె.!
కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో సినీ పరిశ్రమ సర్వనాశనమైపోయిందన్నది నిర్వివాదాంశం. ఇందులో విభేదించడానికేమీ లేదు. కానీ, ఆ పేరు చెప్పి సినిమా టిక్కెట్లు పెంచేసి.. సామాన్యుడ్ని దోచుకుంటే ఎలా.?
పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయ్.. వంట నూనెల ధరలు మండిపోతున్నాయ్.. ఉల్లిపాయ్ దగ్గర్నుంచి, మసాలా దినుసుల వరకూ.. అన్ని రేట్లూ పెరిగిపోయాయ్. సినిమా టిక్కెట్ల ధరలు పెరిగితే తప్పేంటి.!
Telugu Cinema Tickets వినోదానికీ ఓ లెక్కుంది.!
సినిమా అంటే అది ఓ వినోదం. అదేమీ తప్పనిసరి కాదు. దాని రేటు ఎంతుండాలి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
‘నచ్చినోడు ఎంత ఖర్చయినా పెట్టి సినిమా చూస్తాడు.. నచ్చనోడు, ఫ్రీగా చూపిస్తానన్నా సినిమా చూడడు..’ అనే వాదనను కూడా ఇక్కడ పూర్తిగా తప్పు పట్టేయలేం.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి టిక్కెట్ల ధరలు పెంచినా, సినిమాని జనం చూసేశారు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ విషయంలోనూ అదే జరిగింది. అయితే, టిక్కెట్ల ధరలు సాధారణంగా వుంటే, ఇంకా ఎక్కువమంది థియేటర్లలో సినిమా చూసేవారేమో.!
ఓటీటీలో కూడా సినిమాని అమ్మేసుకునే వెసులుబాటు వుంది. పే పర్ వ్యూ.. అన్న కాన్సెప్ట్ అది. ఇక్కడా అంతే, నచ్చినోడు డబ్బులు పెట్టి చూస్తాడు.. నచ్చనోడు ఫ్రీగా వచ్చినా చూడడు.!
ప్చ్.! రేటు పెరిగింది.. సినిమా మునిగింది.!
‘ఆచార్య’ సినిమాకి టిక్కెట్ల పెంపు నష్టం చేసింది. ‘సర్కారు వారి పాట’ సినిమాకి కూడా అదే పద్ధతి చాలా నష్టం కలిగించింది. దాంతో, ‘ఎఫ్ 3’ మూవీ టీమ్ జాగ్రత్త పడింది. టిక్కెట్ల రేట్లు పెంచడం లేదని ప్రకటించేశారు నిర్మాతలు.
అయితే, ప్రభుత్వం సినీ పరిశ్రమ విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకుని టిక్కెట్ల ధరల్ని పెంచేసిన దరిమిలా, ఇప్పుడున్నవి సాధారణ ధరలేమీ కాదు. ఇవీ అసాధారణ ధరలే.!
పెంచడమో, తగ్గించడమో సమస్యకు పరిష్కారం కానే కాదు.!
Also Read: Bigg Boss NON STOP బాగోతం.! సమాజానికి హానికరం.?
ఒక్కటి మాత్రం నిజం. థియేటర్లలో సినిమాకి కాలం చెల్లే అవకాశముందన్న వాదన నానాటికీ బలపడుతోంది. పరిశ్రమ ఈ విషయమై లోతుగా చర్చించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి.