ఓ నటి.. తన మనసుకు నచ్చినోడిని పెళ్ళాడి, ఆ తర్వాత అతనితో పొసగక వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకుని, ఇంకొక వ్యక్తిని పెళ్ళాడితే.. అదొక సంచలనం.! సినీ, రాజకీయ ప్రముఖుల (The Power King Pawan Kalyan Pawanism) విషయంలో ఇలాంటి ‘వేడుకలు’ వెబ్ మీడియాకి భిన్న కోణాల్లో ఉపయోగపడుతుంటాయి.
కొన్ని విమర్శలు, కొన్ని వెటకారాలు.. ఇవన్నీ సర్వసాధారణమే ఇలాంటి విషయాల్లో. కానీ, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ఆయా అంశాల్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే, దాన్ని ‘వెబ్’చారం (వెబ్ మీడియాలో పాత్రికేయ వ్యభిచారం) అనాలేమో.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan( నాలుగో భార్య.. అంటూ ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం.. దాంతోపాటు ఇంకొన్ని మీడియా సంస్థల తీరు ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. కేవలం జనసైనికులు, పవన్ అబిమానులే కాదు.. దాదాపుగా ప్రతి ఒక్కరూ ఈ కథనాలపై తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కాకుండా మరే నటుడి విషయంలో అయినా ఇలా ‘రెండో పెళ్ళాం.. మూడో పెళ్ళాం..’ అని అనే ధైర్యం సోకాల్డ్ ‘వెబ్’చారం చేస్తున్నవాళ్ళకి వుందా.? అన్నది వేరే చర్చ. ఇక, జనసేనాని మీద ‘విషం’ చిమ్మడమే జీవితాశయంగా సదరు సంస్థలు పనిచేస్తున్నాయి.
నిజానికి, తారల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటంలో కొన్ని వెబ్‌సైట్లు ఎన్నో ఏళ్లుగా జుగుప్సాకరమైన తీరు ప్రదర్శిస్తూనే వున్నాయి.. అదొక లాభదాయకమైన బిజినెస్ అయిపోయింది కొందరికి.
ఇదిలా వుంటే, బిగ్‌బాస్ (Bigg Boss) ఫేం అషు రెడ్డి (Ashu Reddy), ఇటీవల పవన్ కళ్యాణ్‌ని కలిసింది. ఆమె పవన్ కళ్యాణ్‌కి (The Power King Pawan Kalyan Pawanism) వీరాభిమాని. పవన్ పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంది కూడా.
పవన్‌ని తాజాగా కలిసి, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్‌మీద తన అభిమానం ఎప్పటికీ తగ్గదని పేర్కొంది. ‘పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే నాలుగో భార్యగా వుంటావా.?’ అని ఓ నెటిజన్ ఆమెను అడిగాడు. ‘యెస్’ అని ఆమె సమాధానమిచ్చింది.
అంతే, దాన్ని పట్టుకుని.. అషు రెడ్డిని పవన్ కళ్యాణ్ నాలుగో భార్యని చేసేసింది ఓ వెబ్ సైట్. మరికొన్ని వెబ్‌సైట్లదీ ఇదే దారి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చెందిన కొన్ని సంస్థలూ ఇదే బాటలో పైత్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యకరం. ప్రముఖ హీరోల విషయంలో కొందరు హీరోయిన్లు, ‘నాకు ఫలానా హీరోని పెళ్ళాడాలని వుంది.. అతనికి పెళ్ళయిపోయినాసరే.. ఆయనంటే ప్రేమ తగ్గలేదు..’ అని చెబుతుంటారు.
అలాంటిది, సాధారణ సినీ అభిమానుల్లో.. ఇంకెంతమంది ఇలాంటి అభిమానంతో వుంటారు.? అలాగని వాళ్ళందరికీ నెంబర్లు కట్టేసి.. ‘వందో బార్య, వెయ్యో మొగుడు..’ అని అనగలమా.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు ‘వెబ్’చారం చేసేవాళ్ళకి ‘నైతిక విలువలతో’ సంబంధమే లేదు.
గతంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సహా పలువురు సినీ ప్రముఖులు ‘గడ్డి పెట్టినా’ బుద్ధి మారలేదు గనుక.. సోకాల్డ్ ‘కులపైత్యం’ కలిగిన వెబ్‌సైట్ లేదా అలాంటి మీడియా సంస్థల నుంచి ‘సంస్కారం’ (The Power King Pawan Kalyan Pawanism) ఆశించలేం.. ఎందుకంటే, అది చేస్తున్నది ‘వెబ్’చారం మాత్రమే. కులగజ్జి నరనరానా జీర్ణించుకుపోయిన ‘వెబ్’చారం.. సమాజానికి అత్యంత హానికరం.