They Call Him OG.. పవన్ కళ్యాణ్ తాజా సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు.
‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించనున్న ఈ సినిమాపై సహజంగానే విపరీతమైన హైప్ ఏర్పడుతోంది.
‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’.. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అంటూ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ జనంలోకి వదిలారు చిత్ర దర్శక నిర్మాతలు.
They Call Him OG.. అసలేంటి కథ.?
ఇక్కడ ‘ఓజీ’ అంటే, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని.‘ మరి, ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అంటే.? ఇంకేముంది, ‘నిప్పుల తుపాను వస్తోంది’ అని.!
‘బాలు’, ‘పంజా’ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, వాటిల్లో ‘గ్యాంగ్‌స్టర్’ వద్ద సహాయకుడిగా మాత్రమే కనిపించాడు పవన్ కళ్యాణ్.
Also Read: చిరంజీవిలా మేం ‘క్వైట్’ కాదు.! రామ్ చరణ్ ‘మెగా’ హెచ్చరిక.!
ఈసారి గ్యాంగ్‌స్టర్ అవతారంలో పవన్ కళ్యాణ్ కన్పించబోతున్నాడు సుజీత్ సినిమా కోసం.
పవన్ లుక్ విషయమై చాలా ట్రోల్స్ జరిగాయిగానీ, సినిమా ప్రారంభోత్సవంలో పవన్ లుక్ చూసి.. అంతా షాక్ అయ్యారు.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ని ఈ సినిమాలో పవన్ ప్రదర్శించబోతున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని విదేశాల్లో చిత్రీకరిస్తారట.