Tillu Square Anupama Siddhu.. ‘డీజె టిల్లు’ అంటూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. మినిమమ్ బడ్జెట్ సినిమాగా వచ్చి అనూహ్యంగా వసూళ్లు కొల్లగొట్టిన సినిమా ‘డీజె టిల్లు’.
యూత్‌ని భలే ఇంప్రెస్ చేసింది ఈ సినిమా. ఇదే జోరులో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకి సీక్వెల్ కూడా అప్పుడే ప్రకటించేశాడు.
సినిమాలోనూ లీడ్ విడిచి పెట్టాడు. బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేసేశాడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా వున్న ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Tillu Square Anupama Siddhu.. లేట్ అయినా లేటెస్ట్గా ‘డీజె’ మోత మోగిపోద్దంతే.!
ఆగస్టు 11న రిలీజ్ కావల్సిన ఈ సినిమాని ‘భోళా శంకర్’ కోసం నెల రోజులు లేట్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆ కొత్త డేట్‌ని అనౌన్స్ చేస్తూ టిల్లుగాడు ఓ పోస్టర్ రిలిజ్ చేశాడు.
సెప్టెంబర్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. మొదటి పార్ట్‌లో హీరోయిన్ నేహా శెట్టితో కలిసి కారులో టిల్లుగాడు చేసే ముద్దులాటకు దగ్గరగా వుందీ పోస్టర్.

ఈ పార్ట్‌లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుపమ (Anupama Parameswaran) తో కలిసి టిల్లుగాని రొమాన్స్ కూడా డబుల్ డోస్‌లో వుండనుందన్న మాట అని తాజా పోస్టర్ చూసి మాట్లాడుకుంటున్నారు.
మస్త్ రొమాంటిక్ మూడ్‌లో రెండో టిల్లుగాడు.!
కారులో అనుపమతో ఘాటుగా రొమాంటిక్ సీన్ లాగించేస్తున్నాడు రెండో టిల్లుగాడు. మామూలుగా అయితే, అనుపమ ఇలాంటి సీన్లకు కాస్త దూరమే.
కానీ, టిల్లుగానితో అట్లుంటది మరి. ఒప్పుకున్నాక చేయాల్సిందే. అయినా అనుపమ కూడా ఈ మధ్య కాస్త మారిందనే చెప్పొచ్చు. అభినయంతో పాటూ గ్లామర్‌కీ ప్రాధాన్యత ఇస్తోంది.
ఆ లిస్టులోనే రొమాన్స్ అయినా కాదు కాదు.. ఇంకాస్త ఘాటు రొమాన్స్ అయినా కొట్టుకుపోవచ్చులే.

ఇక సినిమా విషయానికి వస్తే, మొదటి పార్ట్‌తో పోల్చితే ఇంకాస్త ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Meera Jasmine.. రీ ఎంట్రీలో లక్కు ‘టెస్టు’ పాస్ అవుతుందా.?
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘టిల్లు స్క్వేర్’ రూపొందబోతోంది. మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
మొదటి పార్ట్‌లో తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న సిద్దు జొన్నల గడ్డ ఈ సారి ఎంటర్టైన్మెంట్ కూడా డబుల్ డోస్‌లోనే ఇవ్వబోతున్నాడట.
అన్నట్లు సెప్టెంబర్ 15 అంటే వినాయక చవితి టైమ్. సెలవుల సీజన్. ఆ సీజన్ మనోడికి బాగా కలిసొచ్చే అంశమే. ఇంకేముంది.! ఓ మోస్తరు టాక్ వచ్చినా టిల్లుగాన్ని పట్టుకోలేం.! చూడాలి మరి ఏం చేస్తాడో.!