Tollywood Aa Naluguru Pawan Kalyan.. కొన్నాళ్ళ క్రితం ‘హనుమాన్’ అనే సినిమా వచ్చింది. తేజ సజ్జ హీరో.! సంక్రాంతికి విడుదలైంది ఆ సినిమా.
‘హనుమాన్’ సినిమాతోపాటు మరికొన్ని సినిమాలు అదే సంక్రాంతికి విడుదలయ్యాయి. కానీ, ‘హనుమాన్’ సినిమాకి థియేటర్లు సరిగ్గా దొరకలేదు.
అయితే, ‘హనుమాన్’ సినిమా పెద్ద హిట్టు.. మిగతా సినిమాలు డిజాస్టర్లు. రెండు మూడు రోజులదాకా, ‘హనుమాన్’ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు.. ఫ్లాప్ సినిమాల్నే, ఆయా థియేటర్లలో కొనసాగించారు.
Tollywood Aa Naluguru Pawan Kalyan.. నష్టాన్ని తగ్గించుకోవడానికి..
నష్టాలు పెరిగిపోతున్నాయన్న కోణంలో, చివరికి థియేటర్లను ‘హనుమాన్’ సినిమాకి కేటాయించాల్సి వచ్చింది. అక్కడి నుంచి, ‘హనుమాన్’ సినిమాకి వసూళ్ళ జాతర షురూ అయ్యింది.
గత కొన్నాళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో ఈ వింత పోకడ కనిపిస్తోంది. థియేటర్లను గుప్పిట్లో పెట్టుకున్న సినీ నిర్మాతలే, ఆయా సినిమాల్ని శాసిస్తున్నారు.
దాంతో, కంటెంట్ వున్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారిపోతోంది. పనికిమాలిన సినిమాల్ని బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే, థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయింది.
సినిమా టిక్కెట్ల ధర కంటే, థియేటర్లలో పాప్ కార్న్ ధరలు ఎక్కువగా వుండడం కూడా, థియేటర్ల వైపు ప్రేక్షకులు చూడకపోవడానికి మరో కారణం.
ఆ నలుగురే.. అన్ని అనర్ధాలకీ కారణం..
తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. కానీ, ఓ మోస్తరు సినిమాకీ వసూళ్ళు రాని పరిస్థితి. హిట్టు సినిమాకీ, థియేటర్ల వైపు ప్రేక్షకులు చూడట్లేదు.
అసలు, సినిమా థియేటర్లెందుకు నిర్మాతల గుప్పిట్లో వుండాలి.? ఇదే అసలు సిసలు ప్రశ్న. ఇది వ్యాపారం, ఎవరైనా చేయొచ్చు. కానీ, థియేటర్లు ఇవ్వకపోవడమేంటి.?
Also Read: టెస్ట్ క్రికెట్‌కి విరాట్ కోహ్లీ గుడ్ బై: థాంక్యూ ‘కింగ్’.!
ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి, ఇలానే థియేటర్ల పంచాయితీ కారణంగా ఓ పెద్ద సినిమాకి ఇబ్బంది పడి, చివరికి డిస్ట్రిబ్యూషన్ కూడా తామే చేసుకోవాల్సి వచ్చింది.
చిత్రమేంటంటే, ఆ నలుగురిలో సినిమల నిర్మాణం కొనసాగిస్తున్నది తక్కువమందే. సినిమాల నిర్మాణం వదిలేసి, థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని, భయంకరమైన ఆట ఆడుతున్నారు.
ఈ ఆట కట్టించాలంటే, ప్రభుత్వాలే సంకల్పించుకోవాలి. సినీ నటుడిగా, ఈ దుస్థితిని చూడలేక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, థియేటర్లపై ఆ నలుగురి పెత్తనానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు నడుం బిగించినట్లే కనిపిస్తోంది.