Tollywood Heroes Die Hard Fans సైన్మా హీరోలంటే, ఎట్లుండాలె.! ఆళ్ల అభిమానులు ఇంకెట్లుండాలె.! హీరోలు మంచిగానే వుంటారు. గాళ్ల అభిమానులే చీటికీ మాటికీ గుస్సా అయితరు.
మా హీరో గొప్పంటాడొకడు, ఛల్ బే.. మీ హీరోకి బుర్ర లేదంటాడు ఇంకొకడు. ముట్టి వంకర, పొట్టి చేతులు.. అంటూ యవ్వారం యాడికో పోతది. కొట్టుకుంటరు.. కాళ్లూ చేతులూ ఇరగ్గొట్టుకుంటరు. ఆ తర్వాతేందీ.! దావకానలో చేరుడే.
గీ ముచ్చటే వద్దు. హీరోలందరూ మంచిగే వుంటరు. కలిసి ఖుషీ చేసుకుంటరు. పార్టీల్లో ఎంజాయ్ చేస్తరు.
అర్ధమైంది కదా. ఇంకాస్త అర్ధవంతంగా మాట్లాడుకుందాం.!
రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించారు. అంతకు ముందు దాకా, ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. దానికి ఇద్దరూ కలిసి ఫుల్‌స్టాప్ పెట్టేద్దామనుకున్నారు. దాదాపు పెట్టేశారు కూడా. గుడ్ వన్.
హీరోలు హ్యాపీ.. అభిమానులకే బీపీ.!
చరణ్, మహేష్ కూడా మంచి స్నేహితులే. ఎన్టీయార్, మహేష్ కూడా అంతే. అయినా, హీరోల మధ్య గొడవలెందుకుండాలి.? వుండకూడదు. వుండవు కూడా. హీరోల అభిమానులకే ‘అతి’ ఎక్కువ. అదే అన్ని అనర్ధాలకీ కారణం.
సినిమా ఫంక్షన్లకి జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్లండని హీరోలు చెబుతారు. చెప్పడమేంటీ.? ఎన్టీయార్ అయితే, రోడ్డు ప్రమాదాల వల్ల తండ్రినీ, సోదరున్నీ కోల్పోయిన బాధతో బతిమాలుకుంటాడు అభిమానుల్ని జాగ్రత్తగా వుండమని.
Tollywood Heroes Die Hard Fans.. వీరాభిమానులూ జర సోచ్‌లో.!
ఏ హీరో కూడా అభిమానులు అడ్డగోలుగా ప్రవర్తించాలని కోరుకోడు. నిజానికి అభిమానుల్లో కూడా మంచి వాళ్లే చాలా ఎక్కువమంది. దురభిమానులనండి. అతి అభిమానులనుకోండి.. ఆ జాబితాలో చాలా చాలా తక్కువ మందే వుంటారు. వాళ్లతోనే సమస్య అంతా.
Also Read: ఓయ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్టూ.! ముల్లు గట్టిగా గుచ్చేసుకుంటాది.!
హీరోలు కలిసి మెలిసి వుంటే, అలా కలిసి మెలిసి వుండేలా, కలిసి మెలిసి మల్టీ స్టారర్లు చేసేలా, అభిమానులూ కలిసి మెలిసి వుండి ప్రోత్సహిస్తే, కొత్త కొత్త కథలు తెలుగు తెరపై మరింత విరివిగా వస్తాయ్ కదా. జర సోచ్‌లో.!