Tomato Price Reduced.. టమాటా మళ్ళీ వార్తల్లోకెక్కింది.! గతంలో రికార్డు స్థాయిలో ‘ధరల పెరుగుదల’ గురించిన వార్తల్లోకెక్కితే, ఇప్పుడు రికార్డు స్థాయి పతనం గురించిన వార్తల్లోకెక్కింది టమాటా.!
అప్పుడు పంట లేదు.. దాంతో ధర అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడేమో కావాల్సినంత పంట వుంది.. కానీ, సరైన ధర లేదు.!
ఏం చేయాలో పాలుపోక పండించిన పంటను రోడ్ల మీద పారేస్తున్నాడు టమాటా రైతు.! కిలో రెండు రూపాయలు కూడా పలకడంలేదు రైతుకి టమాటా పంట ద్వారా. ఇదంతా జస్ట్ మేటర్ ఆఫ్ మంత్ అంతే.!
కిలో రెండొందల యాభై రూపాయలెక్కడ.? కిలో రెండు రూపాయలెక్కడ.? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి టమాటా ‘విలాసం, విలాపం’ వ్యవహారానికి సంబంధించి.?
Tomato Price Reduced.. ప్రాసెసింగ్ ఏదీ ఎక్కడ.?
ఫుడ్ ప్రాసెసింగ్.. అంటూ పాలకులు లెక్చర్లు దంచేస్తుంటారు.! మరి, టమాటా విషయంలో ఈ ప్రాసెసింగ్ ఏమయిపోయింది.?
వివిధ రూపాల్లో టమాటాని ప్రాసెసింగ్ చేసి నిల్వ చేయడానికి వీలుంది. కానీ, ఆ దిశగా ప్రభుత్వాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించడం లేదాయె.!
Also Read: కొత్త ఒక వింత.! ‘బ్రిక్ బిర్యానీ’ తెలుసా మీకు.?
ఫలితం.. కొనాలనుకుంటే వినియోగదారుడికీ.. అమ్మాలనుకుంటే రైతుకీ.. నరకం తప్పడం లేదు.! టమాటా విషయంలోనే కాదు, ఉల్లిపాయ్ విషయంలోనూ ఇదే దుస్థితి.
మధ్యలో దలారీలు మాత్రం అటు ధరలు పెరిగినప్పుడూ, ఇటు ధరలు తగ్గినప్పుడూ లాభపడుతున్నారు.
చిత్రమైన విషయమేంటంటే, రైతుకి కిలో టమాటాకి రెండు రూపాయలు కూడా దక్కకపోయినా, వినియోగదారుడు మాత్రం, పాతిక నుంచి యాభై రూపాయల వరకూ వెచ్చించాల్సి వస్తోంది.!