Table of Contents
‘సవ్యసాచి’ (Savyasaachi) అనే విలక్షణమైన టైటిల్. పైగా, ఆ టైటిల్లో చేతి గుర్తు. సినిమా అనౌన్స్మెంట్తోనే, ఈ సినిమాలో ఏదో కొత్తగా వుండబోతోందన్న భావన అందరిలోనూ కలిగింది. దానికి తోడు, నెగెటివ్ రోల్లో మాధవన్ (Madhavan).. విలక్షణమైన కథతో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya).. వెరసి ‘సవ్యసాచి’ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి.
యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదలయ్యింది.
ట్రైలర్లో ఏముందంటే, అన్నీ వున్నాయ్. యాక్షన్ వుంది, ఫన్ వుంది, ఎమోషన్ వుంది.. ఓ ఫక్తు కమర్షియల్ మూవీకి ఏమేం కావాలో అన్నీ దర్శకుడు సమపాళ్ళలో పొందుపర్చాడన్న నమ్మకం కలిగించేలా ట్రైలర్‌ని రూపొందించారు.
సరదాగా సాగిపోయే హీరో లైఫ్‌లోకి విలన్ ఓ తుపానుని తీసుకొస్తాడు. అయితే, అప్పటిదాకా చిన్నపాటి ఫన్‌తో కూడిన ఇబ్బందిని తన ఎడమ చేతి ‘ప్రత్యేకమైన తీరు’ కారణంగా ఎదుర్కొంటున్న హీరోకి, ఆ తుపాను తర్వాతే ఆ చెయ్యి అదనపు బలంగా మారుతుంది.
ఇంతకీ ఆ ‘చెయ్యి’ కథేంటి.?
దర్శకుడు చాలా తెలివిగా సినిమా అనౌన్స్మెంట్తోనే, సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగేలా ‘చెయ్యి గుర్తుతో’ టైటిల్‌ని డిజైన్ చేశాడు. టీజర్లో దాదాపుగా ఆ చేతి గుర్తు తాలూకు ప్రత్యేకతను చెప్పాడు. ట్రైలర్లో మరింత క్లారిటీ ఇచ్చేశాడు. అమ్మ కడుపులో వుండగానే, కవల పిండాలు ప్రత్యేక పరిస్థితుల్లో ఒక్కటిగా మారతాయి. దాంతో, హీరో శరీరం రెండు రకాలుగా స్పందిస్తుంటుంది. ప్రత్యేకించి కుడి చెయ్యిలా సాధారణంగా కాకుండా, ఎడమ చెయ్యి భిన్నంగా, హీరో ఆలోచనలకు అనుగుణంగా కాకుండా వ్యవహరిస్తుంది.
వెరీ వెరీ స్పెషల్ మాధవన్
తెలుగు తెరపై తొలిసారిగా మాధవన్‌ని ఓ స్ట్రెయిట్ సినిమాలో చూస్తున్నాం. అంతకు ముందు చాలా డబ్బింగ్ సినిమాలతో మాధవన్‌ని చూశాం, అతన్ని ఇష్టపడ్డాం కూడా. మాధవన్ అంటే, ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడే. అతని ఫేస్‌లో క్యూట్‌నెస్, హ్యాండ్సమ్ అప్పియరెన్స్.. ఇవన్నీ అమ్మాయిల్ని కట్టి పడేస్తాయి. కానీ, మాధవన్‌లో మాస్ యాంగిల్ కూడా వుంది.
ఏ పాత్రలో కన్పిస్తే, ఆ పాత్రకి జీవం పోసెయ్యగలడు ఈ విలక్షణ నటుడు. ‘గురు’ సినిమా ఒరిజినల్ వెర్షన్లో మాధవన్ నటించి మెప్పించిన సంగతి తెల్సిందే. ‘గురు’ (Guru) వెంకటేష్ (Victory Venkatesh) బాక్సింగ్ కోచ్‌గా నటించిన విషయం విదితమే. ఇక, ఈ ‘సవ్యసాచి’తో తెలుగు ప్రేక్షకులకు మాధవన్ విలనిజం సరికొత్తగా అన్పించడం ఖాయం. నిజానికి ఈ సినిమాకి సర్ప్రైజింగ్ ప్యాకేజీ ఏదన్నా వుందంటే అది మాధవన్ మాత్రమేనని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు.
అందాల ‘నిధి’ అగర్వాల్
తెలుగు తెరపైకి బాలీవుడ్ భామల జోరు పెరిగింది. ‘సవ్యసాచి’తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోన్న నిధి అగర్వాల్ (Agerwal Niddhi), తొలి సినిమా విడుదల కాకుండానే మరో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా అక్కినేని (Akkineni) కాంపౌండ్లోనే కావడం గమనార్హం. ‘సవ్యసాచి’లో అక్కినేని నాగచైతన్యతో క్యూట్‌గా ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించేస్తున్న నిధి, అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటిస్తోన్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా కూడా త్వలోనే విడుదల కాబోతోంది.