Tridha Choudhury Telugu Cinema.. ‘మనసుకు నచ్చింది’ సినిమాతో అందరి మనసుల్ని దోచేసింది అందాల భామ త్రిథా చౌదరి. అంతకు ముందే ‘సూర్య వెర్సస్ సూర్య’ సినిమాలోనూ నటించిందీ ముద్దుగుమ్మ.
ఆకర్షించే అందం, ఆకట్టుకునే అభినయం వున్నప్పటికీ త్రిథా చౌదరి ఎందుకో హీరోయిన్‌గా సక్సెస్ కాలేదు. పలు బెంగాళీ సినిమాల్లో నటించిన అనుభవం వుంది.
అందుకేనేమో అభినయంలో పాప అదుర్స్.. అనిపిస్తుంది. తెలుగులో వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సినిమాలు మాత్రమే చేసింది త్రిథా చౌదరి.
Tridha Choudhury Telugu Cinema.. అందాల పోటీ నుంచి వచ్చి అందరి మనసుకు నచ్చి..
కానీ, బెంగాళీలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే, కొన్ని వెబ్ సిరీస్‌లూ అమ్మడి ఖాతాలో వున్నాయ్.
ఇండియన్ ప్రెష్ ఫేస్ అందాల పోటీల్లో మొదటి ప్రైజ్ గెలుచుకున్న త్రిథా అందానికి ముగ్ధులు కాని వారెవ్వరుంటారు చెప్పండి.

కానీ, ఎందుకో టాలీవుడ్ త్రిథా పాప అందాలను పెద్దగా పట్టించుకోలేదు. తొలి సినిమా ‘సూర్య వెర్సస్ సూర్య’ సక్సెస్ లిస్టులోనే వుంది.
కానీ, రెండో సినిమా ‘మనసుకు నచ్చింది’ మాత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వత ‘అనుకున్నదొకటి అయినది ఇంకొకటి’ సినిమాలో నటించింది.
సినిమాల్లేకుంటే ఏంటీ.!
అటుపై ఇక తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసి హిందీలో వెబ్ కంటెంట్‌పై ఫోకస్ పెట్టింది. అమ్మడి టాలెంట్ వెబ్ సిరీసుల్లో బాగా యూజ్ అయ్యింది.
పలు విభిన్న రకాల పాత్రలతో ఓటీటీలో చెలరేగిపోతోంది త్రిథా చౌదరి. చాలానే వెబ్ సిరీస్‌ల్లో నటించేసింది. అలాగే, కొన్ని పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడి పాడింది.

సినిమాలు లేకున్నా.. వెబ్ సిరీస్‌లూ గట్రా ఇతరత్రా షూటింగుల్లో బిజీగా వున్నప్పటికీ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం భలే చలాకీగా కనిపిస్తుంటుంది.
హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హుషారు తెప్పిస్తుంటుంది. ట్రెడిషనల్ వేర్, వెస్ర్టన్ వేర్.. బికినీ.. వాట్ నాట్ అందాల ఆరబోతలో త్రిథాకి ఆమెకు ఆమెనే సాటి.
Also Read: మాళవిక మోహనన్‌పై సందీప్ రెడ్డి వంగా కన్నేశాడట.!
తాజాగా పింక్ కలర్ డ్రస్‌లో అరవిరిసిన అందంతో మెరిసిపోతోంది అందాల త్రిథా. బ్యాక్ గ్రౌండ్‌లో రెక్కల డిజైన్ త్రిథా అందాన్ని ‘త్రీ’ టైమ్స్.. కాదు.. కాదు పదింతలు రెట్టింపు చేస్తోంది.