Trisha Krishnan Slams Mansoor సినీ నటి త్రిష సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అదీ ఓ నటుడి గురించి.! సదరు నటుడు, త్రిషతో రేప్ సీన్ గురించి కామెంట్ చేశాడు.
సినిమాల్లో రేప్ సీన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? చలపతిరావు అనగానే అరివీర భయంకరమైన రేపిస్ట్ గుర్తుకొస్తాడు తెలుగు సినీ ప్రేక్షకులకి.
కమెడియన్ సుధాకర్, మరో కమెడియన్ గిరిబాబు.. చెప్పుకుంటూ పోతే, సిల్వర్ స్క్రీన్ రేపిస్టులు చాలామందే వున్నారు తెలుగు సినీ పరిశ్రమలో.
తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లోనూ అంతే. రేప్ సీన్లకు అప్పుడూ.. ఇప్పుడూ విపరీతమైన క్రేజ్.. అని ఒప్పుకుని తీరాల్సిందే.
కొందరు హీరోయిన్లు రేప్ సీన్ల విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇంకొందరు, అదీ నటనే కదా.. అని సరిపెట్టుకుంటారు.
వృద్ధ నారీ పతివ్రత.. అని అనకూడదుగానీ.. అదో ‘వాడుక మాట’.! అలా, అప్పట్లో రేప్ సీన్లకు ఒప్పుకుని, ఇప్పుడు మీడియాకెక్కి రచ్చ చేస్తున్నవారి సంఖ్యా తక్కువేమీ కాదు.
Trisha Krishnan Slams Mansoor.. సిల్వర్ స్క్రీన్ రేపిస్టు.!
త్రిష వివాదానికి వస్తే, ఆ నటుడి పేరు మన్సూర్ అలీ ఖాన్. ఈయనా వెండి తెర రేపిస్టుగా గుర్తింపు పొందాడు. ఏదో సందర్భంలో, రేప్ సీన్ల గురించి మాట్లాడుతూ, త్రిష పేరు ప్రస్తావించాడు.
అంతే, విషయం వివాదాస్పదమయ్యింది. త్రిష మనసు గాయపడింది. ఆమె సోషల్ మీడియాలో స్టేట్మెంట్ పాస్ చేయడంతో, ఆమెకు మద్దతుగా సెలబ్రిటీలు క్యూ కట్టారు.

అన్నట్టు, ఇకపై మన్సూర్ అలీఖాన్‌తో సినిమాలు చేసేది లేదని త్రిష తెగేసి చెప్పింది. మన్సూర్ అలీ ఖాన్ ఒకప్పుడు పాపులర్ నటుడు. ఇప్పుడు అరకొరగానే సినిమాలు చేస్తున్నాడు.
ఈ ‘మచ్చ’ కారణంగా, మన్సూర్ అలీ ఖాన్‌కి అవకాశాలు తగ్గిపోతాయ్.! అతను నోరు జారడం ముమ్మాటికీ తప్పే.! కానీ, అతని మీద మరీ ఇంతలా సెలబ్రిటీలు విరుచుకుపడటం ఎంతవరకు సబబు.? అన్న చర్చ తెరపైకొస్తోంది.
తప్పెవరిది.?
ఏది తప్పు.? ఏది ఒప్పు.? సోషల్ మీడియానే ఈ ఛండాలానికి కారణమా.? మీడియా అతి సంగతేంటి.? ఇదింతే.! ట్రోలింగ్ యుగం.! దేన్నీ ఆపలేం.
త్రిషకి ఫాలోయింగ్ వుంది.. ఆమెకు మద్దతుగా నిలుస్తున్న చాలామంది, మన్సూర్ అలీ ఖాన్ మీద నానా రకాల దూషణలతో విరుచుకుపడుతున్నారు. ప్చ్.. ఇదింతే.!
Also Read: Kriti Kharbanda.. ఛీ.. పాడు.! కుక్కతో లిప్ లాక్ ఏంటి పాపా.!
‘ఏం బతుకు మీది.?’ అంటూ మన్సూర్ అలీఖాన్ మీద విరుచుకుపడుతోంటే, ‘ఏం బతుకు మీది.?’ అంటూ త్రిష పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందనే కోణంలో ఆమెపైనా మండిపడుతున్నారు.
త్రిషకు మద్దతుగా నిలుస్తున్నవారిపైనా ‘ఏం బతుకు మీది..’ అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. సోకాల్డ్ నెటిజనం.. ఇంతకీ, ఏం బతుకు మీది.? అనాలా ఇప్పుడు.?