కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూ టర్న్’ సినిమా, తెలుగులో అదే పేరుతో రూపొందింది. అయితే, కన్నడ వెర్షన్ స్థాయిలో తెలుగు వెర్షన్ ఆకట్టుకోలేకపోయిందన్న విమర్శలున్నా, సమంత మాత్రం ‘యూ టర్న్’ (U Turn Samantha Akkineni Shraddha Srinath Alaya F) సినిమాతో నటిగా ఓ మెట్టు పైకెక్కేసిందన్నది నిర్వివాదాంశం.
ఒరిజినల్ వెర్షన్.. అదేనండీ, కన్నడ ‘యూ టర్న్’లో శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) అదరగొట్టేసింది. ఇప్పుడు ఇదే సినిమా హిందీలోకి రీమేక్ అవుతోంది. ‘యూ టర్న్’ హిందీ వెర్షన్ కోసం అలయాని కథానాయికగా ఎంపిక చేశారు నిర్మాత ఏక్తా కపూర్ (Ekta Kapoor).
డేరింగ్ అండ్ డాషింగ్ ఫిలిం మేకర్ అయిన ఏక్తా కపూర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదేమో. కన్నడ ‘యూ టర్న్’ కంటే, తెలుగు ‘యూ టర్న్’ బడ్జెజ్ పరంగా మరో మెట్టు పైకెక్కింది. బాలీవుడ్ వెర్షన్ ‘యూ టర్న్’ అయితే, భారీ ‘బడ్జెట్’తో తెరకెక్కబోతోందంటూ ప్రచారం జరుగుతోంది.
Also Read: Samantha Akkineni.. ఇప్పుడెవరు సిగ్గుపడాలి.?
రోడ్డు మీద వెళుతూ, మార్గ మధ్యంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద.. ‘డివైడర్’ అడ్డంగా వున్నా అడ్డగోలుగా రూల్స్ అతిక్రమించి, యూ టర్న్ తీసుకుని రోడ్డు ప్రమాదానికి కారణమవడం, తదనంతర పరిణామాలు ఈ సినిమా కథాంశం.
ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమా ప్రత్యేకత. అన్నట్టు, ‘యూ టర్న్’ (U Turn Samantha Akkineni Shraddha Srinath Alaya F) మలయాళంలోకి కూడా రీమేక్ అయ్యింది.