వాళ్ళిద్దరూ నటీమణులు. ఎవరి స్థాయిలో వారు సినీ రంగంలో తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకరు ఎక్కువా కాదు, ఇంకొకరు తక్కువా కాదు టాలెంట్ విషయంలో. సంపాదనలోనే తేడాలుంటాయేమో.. స్టార్‌డమ్ పరంగా హెచ్చుతగ్గులుంటాయేమో. ఇద్దరూ (Ugly Fight Between Kangana Ranaut and Tapsee Pannu) మహిళా హక్కుల కోసం నినదిస్తుంటారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తుంటారు.
దురదృష్టమేంటంటే, ఇద్దరూ ఒకర్నొకరు శతృవులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తుంటారు. తాప్సీ కాస్త ఆచి తూచి సెటైర్లేస్తుంటే, కంగనా రనౌత్ (Kangana Ranaut) అర్థం పర్థం లేకుండా విరుచుకుపడిపోతుంటుంది.
నిజానికి, తాప్సీ (Taapsee Pannu) మాత్రమే కాదు కంగనా రనౌత్ పబ్లిసిటీ స్టంట్ల కారణంగా ఇబ్బందులు పడుతున్న నటీమణులు బాలీవుడ్‌లో చాలామందే వున్నారు.
మిగతా విషయాలన్నీ పక్కన పెడితే, సాటి నటిని ఉద్దేశించి బి-గ్రేడ్ అని అభివర్ణించడం ఎంతవరకు సబబు.? అన్న కనీస ఇంగిగతం కంగనా రనౌత్‌లో మచ్చుకైనా కన్పించదు. ప్రతిసారీ ‘నేను ఎ-గ్రేడ్, ఆమె బి-గ్రేడ్’ అని కంగనా రనౌత్, తాప్సీని ఉద్దేశించి విమర్శిస్తూ వుంటుంది.
ఇటీవల తాప్సీ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు జరిగితే, తాప్సీ మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. విమర్శలకూ ఓ హద్దుంటుంది. ఆ హద్దులు తెలియకుండా ప్రవర్తించడమే కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రత్యేకత.
నటిగా కంగనా రనౌత్ ఎన్నో అద్భతమైన పాత్రలు చేసింది.. కానీ, తెరపై ఆయా పాత్రల పరంగా హుందాతనం ప్రదర్శించే కంగనా రనౌత్, రియల్ లైఫ్‌లో మాత్రం హుందాతనం అన్న మాటకే అర్థం తెలియనట్టు వ్యవహరిస్తుంటుంది.
ఎవరైనా, ఎవర్నయినా విమర్శించొచ్చుగాక. ఇందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకోవచ్చుగాక. కానీ, ‘గ్రేడ్స్’ (Ugly Fight Between Kangana Ranaut and Tapsee Pannu) ఇచ్చే స్థాయి తమకు వుందా.? అని ప్రశ్నించుకోవాల్సి వుంటుంది ఎవరికి వారే.