Unstoppable Pawan Kalyan Balakrishna టాక్ షో అంటే.. ఇంటర్వ్యూ విత్ ఎంటర్టైన్మెంట్.!
‘ఆహా’ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం ఓ ఎపిసోడ్‌ని పవన్ కళ్యాణ్‌తో హోస్ట్ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్నారు.
‘ఆహా’లో అల్లు అరవింద్ ఓ వాటాదారు.! ఆ అల్లు అరవింద్ స్వయానా చిరంజీవికి బావమరిది.! అల్లు అరవింద్ సోదరి సురేఖనే కదా చిరంజీవి పెళ్ళి చేసుకున్నది.
నందమూరి అభిమానులకీ, మెగా అభిమానులకీ మధ్య ‘వార్’ ఎప్పటినుంచో వున్నదే.! సినీ రంగంలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ వుంది.. ఇద్దరూ టాలీవుడ్‌లో అగ్రహీరోలు.
Unstoppable Pawan Kalyan Balakrishna ఈ రచ్చ ఏంటి మహాప్రభో.!
అసలు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు.? అంటే, ఇంకెందుకు.. ‘అన్‌స్టాపబుల్’ గురించి రాజకీయ వర్గాల్లోనూ పెద్ద రచ్చే జరుగుతోంది మరి.!
జరుగుతుంది.. జరగదా మరి.! నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కదా.! సో, రాజకీయ అంశాలూ ఈ టాక్ షో ద్వారా చర్చకు రావొచ్చు.
వస్తే, తప్పేముంది.? మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డితో ఇదే ‘అన్‌స్టాపబుల్’ వేదికగా బాలకృష్ణ ముచ్చట్లాడారు కదా.!
టీడీపీ – జనసేన పొత్తు కోసమే ఈ టాక్ షో అన్నది కొందరు వెర్రి వెంగళప్పాయ్‌ల వాదన.! కొందరైతే, ఈ టాక్ షో మీద పడీ పడీ ఏడుస్తున్నారు. అలా ఏడ్చేవాళ్ళలో మంత్రులు కూడా వుండడం గమనార్హం.
ఇదేం ఖర్మ.?
ఏం ఖర్మరా బాబూ.! అది జస్ట్ ఓ టాక్ షో మాత్రమే. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అలరించే ఓ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్.
సగటు తెలుగు సినీ అభిమాని.. ఈ కలయికని చూసి ఎంజాయ్ చేస్తాడు. అంతకు మించి, ఇదేదో రాజకీయాలపై ప్రభావం చూపుతుందనుకుంటే, అలా భయపడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు.
Also Read: కంటతడి పెట్టిన రోజా.! తప్పే సుమీ.!
కడుపుకి తిండి సహించక.. కంటికి నిద్ర పట్టక.. ‘అన్‌స్టాపబుల్’ పేరు చెబితే వణికిపోయే స్థాయికి కొందరు దిగజారిపోయారు. హవ్వ.. ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఇంకేముంటుంది.?
దీన్నొక మామూలు టాక్ షో అని లైట్ తీసుకోలేకపోతున్నారంటే.. ఆ జాడ్యాన్ని ఏమనుకోవాలి.?