Uppena National Award.. ‘ఉప్పెన’ సినిమా గుర్తుంది కదా.? ఎలా మర్చిపోగలం.? భయంకరమైన.. అతి భయంకరమైన ట్రోలింగ్ ఈ సినిమాపై జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) ఈ సినిమాలో హీరోగా నటించడమే ఆ ట్రోలింగుకి కారణం.
కేవలం చిరంజీవి (Chiranjeevi) మీద వ్యతిరేకతతో, ‘ఉప్పెన’ సినిమాపై తొలి రోజు ‘డిజాస్టర్’ ముద్ర వేసేందుకు విశ్వ ప్రయత్నాలూ చేశారు.
అది కోసేశారట కదా..
‘అది కోసేశారట కదా..’ అంటూ విడుదలకు ముందు రోజే విపరీతమైన నెగెటివిటీ తీసుకొచ్చేశారు. సినిమా రిలీజ్ అయ్యింది.. నెగెటివిటీ కొనసాగింది.
కానీ, సినిమాలో పాటలు బాగున్నాయ్.. నటీనటులు బాగా చేశారు. పైగా, లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి (Krithi Shetty) ఇద్దరూ చాలా బాగా నటించారు.

దర్శకుడికీ ఇదే తొలి సినిమా. తొలి సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు. ఆయనే బుచ్చిబాబు సన. సుకుమార్ శిష్యుడు.
Uppena National Award.. ప్చ్.. అది మిస్సయ్యింది..
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ ‘ఉప్పెన’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఉప్పెన.
ఇప్పుడు ఈ సినిమాకి జాతీయ పురస్కారం దక్కింది.. తమ తొలి సినిమాకే ఈ జాతీయ పురస్కారం దక్కడం పట్ల వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, బుచ్చిబాబు సన.. సంబరాల్లో మునిగిపోకుండా వుంటారా.?
Also Read: Mega 157 Chiranjevi.. కాన్సెప్ట్ ‘రహస్యం’ ఏంటంటే.!
‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి, నెగెటివ్ రోల్‌లో కనిపించాడు. నిజానికి, ఈ సినిమాలో పాటలకు సైతం జాతీయ పురస్కారం లభించి వుండాల్సింది.
అన్నిటికీ మించి, ప్రాంతీయ సినిమా కేటగిరీలో తెలుగు భాషకు సంబంధించి కాకుండా, జాతీయ ఉత్తమ చిత్రం అనిపించుకోదగ్గ అన్ని లక్షణాలూ ఈ ‘ఉప్పెన’ సినిమాలో వున్నాయి.
ఏది ఏమైనా, జాతీయ పురస్కారాలకు సంబంధించి ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇప్పటికైనా సోకాల్డ్ విమర్శకుల నోళ్ళకు తాళం పడుతుందేమో వేచి చూడాలి.