టెలివిజన్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ (Urfi Javed) పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది మాత్రం తన స్టైలింగ్‌తోనే. సొంతంగా డ్రెస్ స్టైలింగ్ చేసుకుంటుంది ఉర్ఫీ జావెద్. నిజానికి, ఇలాంటోళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
మంచి టీ షర్టుని కాస్తా, అడ్డగోలుగా కత్తిరించేసి, పీలికలుగా మార్చేసుకుని.. దాన్నో వెరైటీ డ్రెస్‌లా మార్చేస్తుంటుంది ఉర్ఫీ జావెద్. అదే ఆమె ప్రత్యేకత.
బిగ్ బాస్ ఓటీటీలో (హిందీ)లో కూడా సందడి చేసింది ఉర్ఫీ జావెద్.
సీరియళ్ళు, బిగ్ బాస్.. వీటి ద్వారా వచ్చిన పాపులారిటీ కంటే, సోషల్ మీడియా వేదికగా తాను పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలతోనే ఈ బ్యూటీకి ఎక్కువ ఫాలోయింగ్ వచ్చిందనడం నిస్సందేహం.
Urfi Javed ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.!
నిజానికి ఉర్ఫీ జావెద్ ధరించే దుస్తుల్లో చాలావరకు ఛండాలంగా వుంటాయ్. కానీ, ‘అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.?’ అని అంతా ఆశ్చర్యపోతారు.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దగ్గర్నుంచి.. చెత్త కాగితాల వరకూ.. దేన్నీ విడిచిపెట్టదు.. అన్నిటితోనూ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేసుకుంటుంటుంది. అదే ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) ప్రత్యేకత.
ఓ ప్లాస్టిక్ కవర్ ధరించేసి.. ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కవర్ చేసేలా చిన్న చిన్న ‘డార్క్ స్పాట్స్’ పెట్టుకోవడం.. వంటివి ఉర్ఫీ జావెద్ చేస్తుంటుంది.
వల్గారిటీని పక్కన పెడితే..
వల్గర్ డ్రెస్సింగ్ అనే విషయాన్ని పక్కన పెడితే, ఆమె ఐడియాలకి యువత ఫిదా అవుతుంటుంది. అమ్మాయిలు, ఏరికోరి ఉర్ఫీ జావెద్ ధరించే కొన్ని కాస్ట్యూమ్స్ తరహాలో తమ దుస్తుల్ని డిజైన్ చేయించుకుంటుంటారు.
Also Read: Rhea Chakraborty ఈజ్ బ్యాక్.! గ్లామర్ షో షురూ.!
పదిమందిలో తాము ప్రత్యేకంగా కనిపించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా.! ఆ విషయంలో ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) ఎప్పటికప్పుడు సూపర్ సక్సెస్ అవుతుంటుంది.
కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి.. కాదేదీ కాస్ట్యూమ్‌కి అనర్హం.. అంటుంది ఉర్ఫీ జావెద్.!

‘చూసుకున్నోడికి చూసుకున్నంత.. అందం చూడవయా.. ఆనందించవయా.. అందం అరిగిపోతుందా.? తరిగిపోతుందా.?’ ఇలా ఎదురు ప్రశ్నిస్తుంటుంది ఉర్ఫీ జావెద్ తన గ్లామర్ షో విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే.