బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా తెలుగులో చేస్తోన్న తొలి సినిమా ‘బ్లాక్ రోజ్’ (Urvashi Rautela Black Rose) . సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తామని చిత్ర దర్శక నిర్మాతలు సినిమా ప్రారంభోత్సవం రోజే వెల్లడించిన విషయం విదితమే. తెలుగుతోపాటు, పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ‘బ్లాక్ రోజ్’ బృందం ఈ సినిమా నుంచి ఓ పెప్పీ డాన్స్ నెంబర్‌ని విడుదల చేసింది. ఫుల్ సాంగ్‌లో ఊర్వశి రౌతెలా మెస్మరైజింగ్ డాన్స్ స్కిల్స్‌ని ప్రదర్శించింది. మనిషా.? రబ్బరు బొమ్మా.? అనే స్థాయిలో ఊర్వశి జిమ్నాస్టిక్స్ తరహాలో శరీరాన్ని వంచేస్తూ అత్యద్భుతమైన డాన్స్ మూమెంట్స్ చేయడం గమనార్హం.
‘నా తప్పు ఏముందబ్బా..’ అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్‌కి తగ్గట్టుగా ఎక్స్‌ప్రెషన్స్, డాన్స్ పెర్ఫామెన్స్‌తో ఊర్వశి రౌతెలా అదరగొట్టేసింది. కొరియోగ్రఫీ చాలా బాగా కుదిరింది ఈ పాటకి. ఊర్వశి మంచి డాన్సర్ కూడా కావడంతో ఈ పెప్పీ నెంబర్ మరింత అందంగా రూపొందింది.
సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. సెట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్న విషయం విదితమే. మోహన్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రానికి నిర్మాత.
సంగీత దర్శకుడు మణిశర్మ ఈ పాటతో నిజంగానే మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. తన తొలి సినిమానే తనకు తెలుగులో మంచి హిట్ ఇస్తుందని ఊర్వశి రౌతెలా చెబుతోంది. ఇది జస్ట్ ప్రమోషనల్ వీడియో అనీ, సినిమాలో ఎలిమెంట్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తాయని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు.