కొన్నాళ్ళ క్రితం యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్‌తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) ప్రేమలో పడిందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది కాస్తా, తూచ్ అయిపోయింది.
‘తమ్ముడూ..’ అంటూ సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్‌ని ఊర్వశి రౌతెలా ఈ మధ్యనే ర్యాగింగ్ కూడా చేసింది. ‘నన్ను వదిలెయ్ అక్కా..’ అంటూ రిషబ్ పంత్ అంతకన్నా ఘాుటగానే సెటైర్లు వేశాడు.
ఏమయ్యిందోగానీ, కొత్త కథ మొదలు పెట్టింది ఊర్వశి రౌతెలా తాజాగా. ‘ప్రేమలో వున్నప్పుడే నాకు బాధ తెులస్తుంది..8 అంటూ ఆస్తికరమైన పోస్ట్ చేసింది సోషల్ మీయాలో.!
Urvashi Rautela ఈ ప్రేమ బాధకి కారణమేంటి.?
ఊర్వశి రౌతెలా కొత్తగా ఎవరితో అయినా ప్రేమలో పడిందా.? పడే వుంటుందేమో.! లేకపోతే, ఇలా ‘ప్రేమ బాధ’ గురించి ఎందుకు చెబుతుంటుంది.?

దీన్నే విరహ వాదన అని కూడా అంటుంటారు. ఓహో, అదా సంగతి.. అని నెటిజనం నిట్టూరుస్తున్నారు ఊర్వశి రౌతెలా ‘ప్రేమ బాధ’ పోస్టుని చూసి.
ఇంతకీ, తెలుగు సినిమా ఏమైనట్టు..
తెలుగులో ఊర్వశి రౌతెలా ఓ సినిమా చేసింది. దాన్ని సినిమా అనాలో, షార్ట్ మూవీ అనాలో.. ఇంకేమన్నా అనాలో ఎవరికీ తెలియని పరిస్థితి.
అదే, ‘బ్లాక్ రోజ్’ (Black Rose). ‘నా తప్పు ఏమున్నదబ్బా..’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్ తప్ప, ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా గురించి అప్పట్లో చాలా చెప్పాడు.

అందాల పోటీలు, ఆపై బీభత్సమైన మోడలింగ్ కెరీర్.. ఇప్పుడేమో సినిమాలు.. తర్వాతేంటి.? పెళ్ళేనా.? అనడిగితే, అబ్బే, దానిక చాలా టైముందని సమాధానమిస్తోంది ఊర్వశి.
ఈలోగా ఇంకెంతమందిని తన ప్రేమ బాధతో చంపేస్తుందో.? అదేంటీ, ప్రేమ బాధ ఆమెకు కలిగితే, ఎవర్నో చంపేయడమేంటి.?
Also Read: సమంతకి మళ్ళీ ఏమైంది.? ఎందుకింత ఆందోళన.?
అదంతే, ఊర్వశి బాధితులు చాలామందే వున్నారు.. అందులో రిషబ్ పంత్ కూడా వున్నాడంతే. అంతేనా.? అలాగే అనుకోవాలా.?