Veer Vinayak Damodar Savarkar.. ఇంతకీ, ఆయన మంచోడా.? చెడ్డోడా.? దేశ భక్తుడా.? దేశ ద్రోహిగా ఆయన్ని చూడాలా.?
ఏది మంచి.? ఏది చెడు.? ఎవరు చెప్పింది నిజం.? ఎవరు ప్రచారం చేస్తున్నది అబద్ధం.? అంతా అయోమయం.! ఎందుకీ పైత్యం.?
వీర సావర్కార్.. అదేనండీ వినాయక్ దామోదర్ సావర్కార్ గురించి దేశ వ్యాప్తంగా ఇప్పుడు రచ్చ జరుగుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో ఓ సినిమా తెరకెక్కనుంది. నిఖిల్ సిద్దార్ధ హీరో. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తరహాలో, ‘ది కేరళ స్టోరీ’ తరహాలో, ఇప్పుడీ ‘ది ఇండియా హౌస్’ పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Veer Vinayak Damodar Savarkar.. దేశ భక్తుడేనా.?
వీర సావర్కార్‌ని కొందరు దేశ భక్తుడిగా చూస్తారు. ఇంకొందరేమో, ఆయన్ని దేశ ద్రోహిగానూ చూస్తారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా కొన్నాళ్ళపాటు ఆయన జీవించే వున్నారు.
బ్రిటిష్ హయాంలో వీర సావర్కార్ జైలుకు వెళ్ళారు. జైల్లో నానా కష్టాలూ పడ్డారు. ఎలాగైతేనేం, జైలు నుంచి విడుదలయ్యారు కూడా.
విడుదలయ్యే క్రమంలో అప్పటి బ్రిటిష్ చట్టాలను అనుసరించి ‘సంతకం’ పెట్టారు వీర సావర్కార్. అప్పట్లో ఆ ‘సంతకం’ జైలుకెళ్ళినవారందరికీ తప్పనిసరి.
దేశ ద్రోహిగా చూపే ప్రయత్నం..
బ్రిటిష్ పాలకులకు తలొగ్గి, జైలు నుంచి విడుదలయ్యేందుకు ‘సంతకం’ పెట్టారన్నది వీర సావర్కార్ మీద మోపబడ్డ అభియోగం. స్వాతంత్ర్య ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారన్నది ఆ ప్రచారం తాలూకు ఉద్దేశ్యం.
అసలు చరిత్రని ఏ కోణంలో చూడాలి.? మహాత్మాగాంధీ కోణంలో చూస్తే, హింసాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా.. అది క్షమార్హం కాదు.

ఆ లెక్కన, అజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పిన నేతాజీని ఏమనాలి.? అన్న ప్రశ్న తలెత్తుతుంది. స్వాంత్రోద్యమంలో చాలా జరిగాయ్. చాలామంది మీద దేశ ద్రోహులనే ముద్ర పడింది.
చరిత్రను ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు మార్చేసి రాశారు. అదే అసలు సమస్య. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో చూపించిన హిందూ పండిట్ల ఊచకోత నిజం.
కానీ, దాన్ని ఒప్పుకోవడానికి చాలామంది సిద్ధంగా వుండరు. ‘ది కేరళ స్టోరీ’ కూడా అంతే.! ఇప్పుడీ ‘వీర సావర్కార్’ విషయంలో అయినా అంతే.!