Table of Contents
బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Telugu 3 Big Wickets) మూడో సీజన్ తెలుగులో అంచనాల్ని మించి రక్తి కట్టిస్తోందా.? అసలు ఆడియన్స్‌ని మూడో బిగ్‌బాస్ ఆశించిన మేర అయినా ఆకట్టుకుంటోందా.? కంటెస్టెంట్స్, ఆడియన్స్‌కి కావాల్సినంత ఎంరట్‌టైన్‌మెంట్ ఇవ్వగలుగుతున్నారా.?
మొత్తం వ్యవహారమంతా ఫ్యాబ్రికేటెడ్ అంటూ వస్తోన్న విమర్శల మాటేమిటి.? రోజుకో కొత్త వివాదం తెరపైకొస్తున్న దరిమిలా, అందులో నిజానిజాలెంత.? అనూహ్యంగా ట్రాన్స్‌జెండర్‌ని బిగ్‌హౌస్‌లోకి తీసుకురావడంలో ఉద్దేశ్యమేంటి.? ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు.? హౌస్‌లో మిగిలేదెవరు.?
ఇలా ఎన్నెన్నో ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నల చుట్టూ సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఆ చర్చల సంగతి పక్కన పెడితే, మొదట్లో మంచి పేస్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్ రియాల్టీ షోలో వేగం తగ్గిన మాట వాస్తవం. ఎందుకు తగ్గింది.? అంటే, దానికి మళ్ళీ చాలా కారణాలున్నాయి.
దుమ్ము రేపేస్తారనుకున్న కంటెస్టెంట్స్ సైలెంట్ అయ్యారు. చిత్ర విచిత్రమైన గొడవలు తెరపైకొస్తున్నాయి. అవి, ఇంట్రెస్టింగ్‌గా వుండడంలేదు సరికదా, ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నాయి. 24 గంటల్లో, 60కి పైగా కెమెరాలు చిత్రీకరించే దృశ్యాల్ని ఎడిట్ చేసి, కేవలం ఒక్క గంట పాటు ప్రదర్శించే ఎపిసోడ్ చూసి లోపటి పరిస్థితుల్ని అంచనా వేసెయ్యగలమా.? ఛాన్సే లేదు.
బిగ్ బాస్.. అంతా మాయ..
అవును, బిగ్‌హౌస్‌లో చాలా జరుగుతాయి. కొన్ని మాత్రమే చూపిస్తారు. అవసరమైనవే టెలికాస్ట్ చేస్తారు. ఇలాంటి వాదనలు గతంలోనూ విన్నాం. ఇప్పుడూ వింటున్నాం. హేమ బయటకు వచ్చాక, హౌస్‌లో ఏం జరుగుతుందో చెప్పేసింది. తమన్నా ఎంట్రీ ఇచ్చాక బిగ్ హౌస్‌లో మరీ నాటకీయత పెరిగిపోయిందన్నది నిర్వివాదాంశం.
ఎంట్రీ ఇస్తూనే, వరుణ్ సందేశ్‌తో (Varun Sandesh) ఓ ఆట ఆడుకుంటానని ప్రకటించింది (Bigg Boss Telugu 3 Big Wickets) ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి (Tamanna Simhadri). ఆ తర్వాత రవికృష్ణని (Ravi Krishna) టార్గెట్ చేసింది.
హౌస్‌లో తమన్నా అలకలు చాలా విసుగు తెప్పించేస్తున్నాయి. జైల్ ఎపిసోడ్‌లో అయితే, ‘ఏసీ లేకపోతే నిద్రపట్టదు’ అంటూ తమన్నా పేల్చిన డైలాగ్ సోషల్ మీడియాకి పెద్ద పండగే తెచ్చిపెట్టింది. కుప్పలు తెప్పలుగా మీమ్స్ ఆ డైలాగ్ చుట్టూ పుట్టుకొచ్చేశాయి.
అర్థం పర్థం లేని చిల్లర గొడవలు..
సావిత్రి అలియాస్ శివ జ్యోతి (Savithri Siva Jyothy) చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేసేస్తుండడం మరో ఆసక్తికరమైన విషయం. ఎవరో ఒకరు హౌస్‌లో ఏడవాల్సిందేనన్న రూల్ పెట్టారో ఏమోగానీ, ఈ ఏడుపులు ఇంకా చికాకు తెప్పిస్తున్నాయి.
బిగ్‌బాస్ (Bigg Boss 3 Telugu) ఇచ్చిన టాస్క్ చేసే క్రమంలో వరుణ్ – సావిత్రి మధ్య చిన్న వివాదం, సావిత్రి ఏడ్చేదాకా వెళ్ళింది. హౌస్‌లో పలుమార్లు వితిక షెరు (Vithika Sheru) బోరుబోరున ఏడ్చేయడం చూశాం.
హిమజ (Himaja), అషురెడ్డి (Ashu Reddy), శ్రీముఖి (Sree Mukhi) కూడా తమ ఏడుపుని ప్రదర్శించేశారు. మరోపక్క, తమన్నా టార్చర్ తట్టుకోలేకపోతున్నారు హౌస్‌మేట్స్. మొన్న రవికృష్ణ, తాజాగా అలీ.. తమన్నా ఓవరాక్షన్‌కి విసుగు చెందుతున్నారు. ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసి, వివాదం రాజేసి, తాను కెమెరాలకు ఫేవర్ అవ్వాలనుకుంటోంది తమన్నా.
వీకెండ్.. నాగ్ ఏం మాయ చేస్తాడో..
ఇదిలా వుంటే, తాను ఎలా ట్రాన్స్‌జెండర్ అయ్యిందీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో తమన్నా వివరణ ఇచ్చుకుంది. మొత్తంగా చూస్తే హౌస్‌లో ఆచి తూచి వ్యవహరిస్తున్నది పునర్నవి (Punarnavi Bhupalam) మాత్రమేనేమో అనిపించకమానదు. ఏదిఏమైనా బిగ్‌బాస్ రియాల్టీ షో మూడో సీజన్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది.
వీకెండ్‌లో నాగ్ వస్తాడు (Akkineni Nagarjuna) గనుక, ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయేమో, ఆ తర్వాత ఎపిసోడ్ జోరందుకుంటుందేమో (Bigg Boss Telugu 3 Big Wickets) చూడాలిక.
మిగతా విషయాలెలా వున్నా తమన్నా సింహాద్రి దెబ్బకి బిగ్ వికెట్స్ ఏవో పడేలానే వున్నాయి. వికెట్లే పడతాయో.. వరుణ్ సహా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇమేజ్ దెబ్బ తీయడానికే ఆమెను అస్త్రంగా బిగ్ బాస్ ప్రయోగించారో ప్రస్తుతానికి అర్థం కావడంలేదు.