Vidya Balan Cinema Colors.. బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేరు చెప్పగానే, ముందుగా ‘డర్టీ పిక్చర్’ సినిమా అందరికీ గుర్తుకొస్తుంది.!
నిజానికి, ఎన్నో బాలీవుడ్ సినిమాలతో నటిగా విద్యాబాలన్ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్టు తెలుగులోనూ ‘ఎన్టీయార్ బయోపిక్’లో ఆమె నటించిందండోయ్.!
నటిగా విద్యాబాలన్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? నటిగా ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది.
బోల్డన్ని అవార్డులే కాదు.. విద్యాబాలన్ మీద విమర్శలూ వచ్చాయ్.! కానీ, విమర్శలకి తాను ఏనాడూ కుంగిపోలేదనీ, సక్సెస్ వచ్చినప్పుడు విర్ర వీగలేదనీ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
Vidya Balan Cinema Colors.. రంగుల జీవితం.!
ఎప్పుడూ కలర్‌ఫుల్ లైఫ్‌ని ఇష్టపడతానంటోంది విద్యాబాలన్. ‘అంటే, నా చుట్టూ ఎప్పుడూ ఆనందం వుండాలి. అలాగే, నా సినిమాల్లో కూడా అన్నీ వుండాలి’ అని చెబుతోందామె.

‘కొన్ని సినిమాల్లో కామెడీ కుదరదు.. అలాంటప్పుడు కొంత బాధ కలుగుతుంది.. కానీ, ఒక్కసారి పాత్రలోకి వెళ్ళిపోయాక.. అదే మూడ్‌లో వుండిపోతాను..’ అని చెప్పింది విద్యాబాలన్.
ఏదన్నా సినిమాలో నటిస్తే, ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో.. ఆ సినిమాలోని పాత్ర తరహాలోనే బిహేవ్ చేయాలనిపిస్తుందని విద్యాబాలన్ చెబుతుండడం గమనార్హం.
డర్టీ పిక్చర్.. వెరీ వెరీ స్పెషల్.!
‘డర్టీ పిక్చర్’ సినిమా గురించి మాట్లాడుతూ, ఆ సినిమాలో నటిస్తున్నన్ని రోజులూ, తనను తాను ‘సిల్క్’గానే భావిస్తూనే వచ్చానని వ్యాఖ్యానించింది.

ఆ సినిమా విద్యాబాలన్‌కి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డన్ని అవార్డులు. వాటితోపాటే, ఎన్నో వివాదాల్ని కూడా విద్యాబాలన్ ఎదుర్కొంది.
Also Read: చిట్టీ.! నువ్వొస్తానంటే వాళ్ళే వద్దంటున్నారా.?
నటనకు భాషతో సంబంధం లేదనీ, ఏ లాంగ్వేజ్‌లో సినిమా చేసినా.. కథ కథనాలు బావుంటే, ప్రేక్షకులు ఆయా పాత్రలతో కనెక్ట్ అయిపోతారన్నది విద్యాబాలన్ చెబుతున్నమాట.
అంతే మరి.! ఊరికే స్టార్‌డమ్ వచ్చేస్తుందా.? బాడీ షేమింగ్ సహా ఎన్నెన్నో ఇబ్బందుల్ని విద్యా బాలన్ ఎదుర్కోవాల్సి వచ్చింది.! కానీ, వాటన్నిటినీ అధిగమించిందామె.!