Vijay Deverakonda Abhishek Pictures.. అదో సినీ నిర్మాణ సంస్థ.! నిర్మాతకీ, హీరోకీ తేడా తెలియని నిర్మాణ సంస్థ అనుకోవాలేమో.!
సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నస్టపోతే, హీరో ఎందుకు ఆ నష్టాన్ని భరిస్తాడన్న ఇంగితం లేకపోవడమేంటి.? మరి.!
సినీ నటుడు విజయ్ దేవరకొండ, తన తాజా చిత్రం ‘ఖుషి’ సినిమా విజయం సాధించిందన్న ఆనందంలో, వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున.. మొత్తంగా కోటి రూపాయల సాయాన్ని ప్రకటించాడు.
దీన్ని సామాజిక బాధ్యత.. అనే కోణంలోనే చూడాలి.! ఇలాంటి సాయం ఎవరు చేసినా, స్వాగతించాలి.. పది మంది ఇలాంటి సాయం చేయాలని కోరుకోవాలి.
సాయం చేసేందుకు వీలుగా ఆయా వ్యవహారాలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అప్పుడే చక్కబెట్టేస్తున్నాడు కూడా.
Vijay Deverakonda Abhishek Pictures.. ఆ నష్టాల సంగతేంటి విజయ్.?
ఇంతలోనే, ఓ సినీ నిర్మాణ సంస్థ గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి సమాధానం చెప్పమంటోంది.

ఆ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్. ఎనిమిది కోట్లు నష్టం వచ్చిందట. మానవత్వంతో స్పందించి, న్యాయం చేయాలంటూ సదరు సంస్థ విజయ్ దేవరకొండని ఉద్దేశించి, అతన్ని ట్యాగ్ చేస్తూ ట్వీటేసింది.
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లుంది అభిషేక్ పిక్చర్స్ సంస్థ తీరు. నష్టాలపై నిర్మాణ సంస్థని కదా ప్రశ్నించాలి.? హీరో ఏం చేయగలడిక్కడ.?
సాయం చేసినోడి చేతులు నరికెయ్.!
కొందరు అంతే.! ఎవరన్నా నిలబడి సాయం చేయాలని ప్రయత్నిస్తే. కాళ్ళు విరగ్గొట్టేస్తారు.! అభిషేక్ పిక్చర్స్ సంస్థ, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో అదే చేస్తోంది.
Also Read: OG Pawan Kalyan Glimpse: నెత్తురుకి మరిగిన చీతా.!
వంద కుటుంబాలు.. చిన్న విషయం కాదు.! లక్ష రూపాయలు ఆయా కుటుంబాలకు ఎంతో విలువైనవి. ‘చిల్లరతనం’ అనేది చిన్న మాట అభిషేక్ పిక్చర్స్ వ్యవహరించిన తీరు విషయంలో.
ఒకవేళ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా హిట్టయి వుంటే.. తద్వారా వచ్చే లాభాల్లోంచి హీరోకి ఆ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అదనంగా చెల్లించేవాళ్ళా.?
వాస్తవానికి, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకి సంబంధించి విజయ్ దేవరకొండ కూడా పూర్తి రెమ్యునరేషన్ పొందలేదనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.