హీరోగా ఓ పక్క తిరుగులేని స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తూనే, ఇంకోపక్క సినిమా నిర్మాణంలోకి దిగాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తాను దాచుకున్న డబ్బులన్నిటినీ సినిమా నిర్మాణంలో (Meeku Mathrame Cheptha) పెడుతున్నట్లు విజయ్ దేవరకొండ (Rowdy Hero Vijay Deverakonda) ప్రకటించడం గమనార్హం.
ఇంతకీ, విజయ్ దేవరకొండ నిర్మాతగా మారుతున్నది ఏ సినిమానో తెలుసా.? ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న సినిమా అది. ఇందులో ‘పెళ్ళిచూపులు’ ఫేం దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవాలి.
లైఫ్ అంటేనే ఛాలెంజ్ అనీ, ఈ లైఫ్‌లో ఛాలెంజెస్ తీసుకోకపోతే అసలు లైఫ్‌కే అర్థం వుండదనీ చెబుతూ, ‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్‌ని రివీల్ చేశాడు విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ హిల్ (King Of The Hill) బ్యానర్ ద్వారా ఈ సినిమా నిర్మించబోతున్నాడు రౌడీ హీరో.
సాదా సీదాగా టైటిల్‌ని అనౌన్స్ చేస్తే కిక్కేముంటుంది.? ప్రెస్‌మీట్లు పెట్టడం, ఇంకో రకంగా టైటిల్ రివీల్ చేయడం.. వీటిల్లో కిక్ కన్పించలేదేమో.. అందుకే, ఓ వీడియో ద్వారా తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు విజయ్ దేవరకొండ.
అందుకే, రౌడీస్.. తమ రౌడీ హీరోని అంతలా అభిమానిస్తారు. అందరూ వెళ్ళేదారిలో కాదు, ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తాడు. ‘పెళ్ళిచూపులు’, విజయ్ దేవరకొండ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా. ఆ తర్వాతే ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలొచ్చాయి.
Click Here: రౌడీ హీరో.. బాక్సాఫీస్ బంగారు కొండ.!
తనను సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ని.. హీరోగా మార్చడమంటే అందులో విజయ్ దేవరకొండ ఏ స్థాయి కిక్‌ని పొందుతున్నాడో కదా.!
‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ వెరైటీ టైటిల్‌తో ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో (Meeku Mathrame Cheptha) అతిథి పాత్రలో అయినా కనిపిస్తాడా.? అనసూయ భరద్వాజ్, ప్రియా భవానీ శంకర్ సహా పలువురి పేర్లు విన్పిస్తున్న దరిమిలా, అఫీషియల్ డిటెయిల్స్ ఎప్పుడొస్తాయి.? ఏమో, ఆ డిటెయిల్స్ కోసం వేచి చూడాల్సిందేనేమో.!