Vijay Deverakonda Kingdom Release.. ‘రౌడీ’ విజయ్ దేవరకొండ, తగలబెట్టేస్తానంటున్నాడు.! సినిమాలోనే లెండి.!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘కింగ్‌డమ్’ విడుదలకు సిద్ధమైంది.
సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఏమో.. అన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ నెల 31న అంటే, జులై 31న ‘కింగ్‌డమ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Deverakonda Kingdom Release.. వాయిదాల మీద వాయిదా పడుతూ..
‘కింగ్‌డమ్’ సినిమా, అనివార్య కారణాల వల్ల వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది.
సెప్టెంబర్ దాటి, ఆ తర్వాత ఎప్పుడో సినిమా రిలీజ్ అవ్వొచ్చని చాలామంది అనుకున్నారుగానీ, ఈ నెలాఖరున సినిమా విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమో కూడా విడుదల చేసింది ‘కింగ్‌డమ్’ టీమ్.
నిజంగానే తగలబెట్టేసేలా వున్నాడు..
‘రౌడీ’ విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాతో నిజంగానే తగలబెట్టేసేలా వున్నాడు.. తగలబెట్టేయడమంటే, హై ఓల్టేజ్ యాక్షన్ అన్నమాట.
నాగవంశీ – సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ ‘కింగ్‌డమ్’ సినిమాలో హీరోయిన్.
‘లైగర్’ నుంచి వరుసగా ఫ్లాపులు చవిచూస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ, ‘కింగ్‌డమ్’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని, అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.