Vijayasai Reddy Liquor Scam.. దొరికిన దొంగలెవరు.? దొరకని దొంగలెవారు.? అసలు ఆయన పేరుని లాగుతున్నదెవరు.?
రూపాయి కూడా ముట్టకుండానే, ‘అక్రమాస్తుల’ కేసులో ఏ2 అనే గుర్తింపు లభించిందా.?
తెలుగు నాట రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరది. ఔను, ఆయనే విజయ సాయి రెడ్డి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేత.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే, నెంబర్ టూ విసారె అలియాస్ విజయ సాయి రెడ్డి..!
విశాఖ అంటే విజయ సాయి రెడ్డి, విజయ సాయి రెడ్డి అంటే విశాఖ.. అనేంతలా, విశాఖ వైసీపీ రాజకీయాల్లో, విజయ సాయి రెడ్డి పేరు మార్మోగిపోయేది.
Vijayasai Reddy Liquor Scam.. విసారె కనుసన్నల్లో..
అట్నుంచి, ఇటు దాకా.. విశాఖలో వైసీపీ దోపిడీ అంతా, విజయ సాయి రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తుంటాయ్.
కానీ, రోజులు మారాయ్.! వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు అయిన విజయ సాయి రెడ్డి, అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేశారు.

ఇప్పుడేమో, వైసీపీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్న లిక్కర్ మాఫియా కేసులో, విజయ సాయి రెడ్డి, ‘సాక్షిగా’ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా, ఈ కేసులో విజయ సాయి రెడ్డిని కూడా నిందితుడిగా ‘సిట్’ చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క, విజయ సాయి రెడ్డి మాత్రం, ఏపీ లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్.. అని చెప్పుకుంటున్నారు.
విజిల్ బ్లోయర్ అనగానేమి.?
విజయ సాయి రెడ్డి ‘చొరవ’ వల్ల ఈ కేసు వెలుగులోకి వస్తే, ఆయన్ని విజిల్ బ్లోయర్.. అనేందుకు అవకాశం వుంది.
కానీ, కేసుని కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చాక, విచారణకు హాజరయి తానే విజిల్ బ్లోయర్ అని విసారె చెప్పుకుంటే ఎలా.?
Also Read: జనసేన జెండా అవనతం! జాతీయ జెండా ఎందుకలా చేయలేదంటే!
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అంటూ ట్వీటేశారు విజయ సాయి రెడ్డి తాజాగా. ఈ ట్వీట్లతో విసారె ‘నిర్దోషి’ అని అనగలమా.?

దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్.. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రినే పీఠం నుంచి తప్పించింది. మరి, ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కామ్.. ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో.!
అన్నట్టు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ చాలా చాలా పెద్దదట. నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే ఆరోపణలు వస్తున్నాయ్. దొరకని దొంగలు.. అన విసారె అంటున్నారంటే, వైఎస్ జగన్ గురించేనా.?