Table of Contents
Vijayendra Prasad Rajya Sabha..రాజ్యసభకు నలుగుర్ని నామినేట్ చేశారు.. ఆ నలుగురూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే.
దక్షిణాదిన బీజేపీ బలపడే ప్రయత్నాల్లో వుంది గనుక, వ్యూహాత్మకంగా ఆ నలుగుర్నీ రాజ్యసభకు నామినేట్ చేశారన్నది ప్రముఖంగా జరుగుతున్న చర్చ.
రాష్ట్రపతి కోటాలో ఆ నలుగుర్నీ నామినేట్ చేయడంతో.. ఆయా వ్యక్తుల గురించి సహజంగానే మీడియాలో, ప్రజల్లో ప్రత్యేక చర్చ జరుగుతోంది.
ఆ ముగ్గురూ చాలా చాలా ప్రత్యేకం.!
ఇళయరాజా.. సంగీత శిఖరం. ఆయన్ని రాజ్యసభకు పంపడం అంటే, రాజ్యసభ గౌరవాన్ని మరింత పెంచడమే అన్న అభిప్రాయం చాలామందిలో వుంది.
పీటీ ఉష.. పరుగుల రాణి.. దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన క్రీడాకారిణి.. ఎందరికో స్ఫూర్తి. ఆమెను రాజ్యసభకు పంపడం కూడా సముచితమే. పైగా, మహిళా లోకానికి క్రీడల విషయమై ఓ మంచి సందేశాన్ని పంపినట్లవుతుంది కూడా.
వీరేంద్ర హెగ్దే.. ఈయన కూడా సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన్ని రాజ్యసభకు పంపడం పట్ల కూడా ఎలాంటి వివాదమూ లేదు.!
Vijayendra Prasad Rajya Sabha ..విజయేంద్రప్రసాద్.. ఎందుకీ వివాదం?
కానీ, విజయేంద్ర ప్రసాద్ విషయంలో ఎందుకు వివాదం తెరపైకొస్తోంది.? ఆయన సినీ కథా రచయిత.
తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు రచయితగా పనిచేశారు. బోల్డన్ని సూపర్ హిట్ సినిమాలతో రచయితగా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్నారు.

సంగీతం కంటే, సినిమాలకు రచయితగా పనిచయడం తక్కువా.? దేనికదే ఎక్కువ. కానీ, స్ఫూర్తి అనేదొకటి వుంటుంది కదా.? అక్కడే వస్తోంది అసలు సమస్య.
అసలు రాజ్యసభకు ఎవరు వెళ్ళాలి.? అన్నదానిపై మళ్ళీ బోల్డంత చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటుంది. ఆయా రాజకీయ పార్టీలు తమక్కావాల్సినవారిని రాజ్యసభకు పంపుతుంటాయ్.
‘కొనుక్కుంటే రాజ్యసభ సీటు వస్తుంది..’ అనే భావన కూడా చాలామందిలో వుంది. అలా కొనుక్కున్న వ్యక్తుల్లో విజయ్ మాల్యా లాంటోళ్ళు కూడా వున్నారంటారు. అదెంతవరకు వాస్తవం.? అన్నది వేరే చర్చ మళ్ళీ.
రాజ్యసభ గౌరవం పెరుగుతుందా.? తగ్గుతుందా.?
ఫలానా వ్యక్తి రాజ్యసభకు వెళితే ఆ రాజ్యసభ గౌరవం పెరిగిందని అనుకుంటుంటాం. కొందరు రాజ్యసభకు వెళుతోంటే, రాజ్యసభ స్థాయి దిగజారిపోయిందనే భావన కలుగుతుంటుంది.!
Also Read: మెగాస్టార్ చిరంజీవి అవుతారా పొలిటికల్ ‘గాడ్ ఫాదర్’.?
అసలు విజయేంద్రప్రసాద్ విషయంలో ఎందుకీ వివాదం.? వివాదం సంగతి సరే.. ఏ కోణంలో ఆయన్ని రాజ్యసభకు పంపి వుంటారు.? అన్నదానిపై స్పష్టత లేదు. అదే అసలు వివాదానికి కారణం.
విజయేంద్రప్రసాద్ మన తెలుగువాడు.. కానీ, తెలుగునాట కూడా విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు వెళ్ళడంపై ప్రశ్నలొస్తున్నాయ్.!