Table of Contents
Vikram Telugu Review.. కమల్ హాసన్ అంటే విశ్వనటుడు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. నటుడిగా కమల్ హాసన్ ప్రతిభ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది.?
ఇప్పుడు కొత్తగా కమల్ హాసన్ నటన గురించి మాట్లాడుకోవడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. కమల్ నుంచి ‘విక్రమ్’ (Vikram Movie) సినిమా వచ్చాక, కమల్ నటనపై ప్రశంసల వర్షం కురవడం మామూలే.
కానీ, అంతకు మించి.. ఈసారి దర్శకుడి మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడి పనితనం ప్రత్యేకించి కనిపిస్తుంటుంది.
లోకేష్ కనగరాజ్.. ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్లా మారిపోయింది. ఈ సినిమాలో లోకేష్ (Lokesh Kanagaraj) చేసిన మ్యాజిక్ ఏంటంటే, ఎవర్ని ఎలా వాడాలో అలా వాడేశాడు. నటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ, లోకేష్ కనగరాజ్ పెర్ఫెక్ట్గా వాడాడు.
విక్రమ్.! ఇది నిజంగానే డిఫరెంట్ సినిమా.!
ఫహాద్ ఫాజిల్ చుట్టూ కథ నడుస్తున్నప్పుడు, ఆయా సన్నివేశాల్లో ప్రత్యక్షంగా ఫహాద్ లేకపోయినాగానీ, మనం అతని ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతాం. విజయ్ సేతుపతి విషయంలోనూ అంతే.
కమల్ గురించి ఏం చెప్పేది.? సినిమా అంతా, ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ ప్రెజెన్స్ కనిపిస్తుంది.. ఆయా సన్నివేశాల్లో ప్రత్యక్షంగా ఆయన లేకపోయినాగానీ.!

ఓ బుడ్డోడి ప్రెజెన్స్ కూడా మనం ఫీల్ అవుతాం.. ఆయా సన్నివేశాల్లో ఆ బుడ్డోడు కన్పించకపోయినాగానీ. సినిమా చివర్లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తే, సినిమా చూశాక.. ఆ పాత్ర వెంటాడుతుంది మనల్ని.
హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ‘కేజీఎఫ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం. రాజమౌళి సినిమాల్లో అయితే ఇవి ఇంకో లెవల్లో వుంటాయ్.! అంతకు మించి.. అనేలా వుంది విక్రమ్.!
Vikram Telugu Review.. చిల్లర వేషాలెయ్యలేదు..
చిల్లర కామెడీ కోసం ప్రయత్నించలేదు.. గ్లామర్ గురించి అస్సలు ఆలోచించలేదు.. అవనసరమైనది ఏదీ ఈ సినిమా కోసం వాడలేదు. అదే ‘విక్రమ్’ ప్రత్యేకత అని చెప్పుకోవాలేమో.!
ఆ వయసేంటి.? ఆ స్టైలింగ్ ఏంటి.? ఆ ఎనర్జీ ఏంటి.? అందుకే, కమల్ హాసన్ విశ్వనటుడు అయ్యాడు. ఫహాద్ ఫాజిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవర్ హౌస్ అని చెప్పొచ్చు.!
విజయ్ సేతుపతి సహా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారనడం కంటే, ఆయా పాత్రల్లో జీవించేశారనడం కరెక్ట్.!

సినిమాలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. కొన్ని సూపర్ హిట్లు అవుతుంటాయ్.. కానీ, ‘విక్రమ్’ లాంటి సినిమాలు.. ఎప్పటికీ గుర్తుండిపోతాయ్.
ఓ ఖైదీ, ఓ విక్రమ్.. సినిమా చూశాక కూడా వాటి ఇంపాక్ట్ చూసినవారి మీద చాలా చాలా ఎక్కువ కాలం అలా వుండిపోతాయ్.!
ఎందుకిలా చేశావ్ కమల్.?
చివరగా.. థియేటర్లలో సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత రివ్యూ రాయడానికి కారణమేంటంటే.. ఓటీటీలో వచ్చాక రాద్దామని కాదు.. థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ ఎక్స్పీరియన్స్.. రెండిటి మధ్యా తేడా కోసం.
Also Read: రెసూల్ పూకుట్టి కాటుకి కీరవాణి చెప్పు దెబ్బ.!
కానీ, ఈ సినిమా విషయంలో ఆ తేడా ఏమీ లేదు.. సేమ్ ఇంపాక్ట్.! ఆ ఇంపాక్ట్ ఎన్ని రోజులు వుంటుందా.? అని తెలుసుకోవడానిక్కూడా ఈ ఆలస్యం.! ఎన్ని రోజులైనాసరే.. ఆ ఇంపాక్ట్ అలాగే వుండిపోయింది.. వుండిపోతుంది కూడా.!
ఎందుకిలా చేశావ్ కమల్ హాసన్.? (Kamal Haasan) ఔను, దశాబ్దకాలం పట్టిందా ఇలాంటి సినిమా చేయడం కోసం.? ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ఏ సినిమా చేసినా ఓ ప్రయోగంలానే చేస్తారు.
అయితే, ఈసారి ప్రయోగం.. ఇంకాస్త ప్రత్యేకం.! అందుకే, ఇలాంటి సినిమా చేయడానికి ఎందుకింత ఆలస్యం.? అని కమల్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. అదీ ప్రేమతో.!