Home » వినయ విధేయ తారక రాముడు.!

వినయ విధేయ తారక రాముడు.!

by hellomudra
0 comments

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంంట్ల తారకరామారావు (Telangana Rashtra Samithi Working President Kalvakuntla Taraka Ramarao) ముఖ్య అతిథిగా ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ లాంఛ్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. కేటీఆర్‌ (Vinaya Vidheya Taraka Rama), ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ట్రైలర్‌లో వినయ రాముడు, విధేయ రాముడు కన్పించలేదు.. విధ్వంస రాముడే కన్పించాడు.. అంటూ వ్యాఖ్యానించారు.

‘ధృవ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి తాను హాజరయ్యాననీ, ఇప్పుడు ఈ సినిమా ఫంక్షన్‌కి హాజరయ్యాననీ, ‘వినయ విధేయ రామ’ సంచలన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాననీ కేటీఆర్‌ చెప్పారు.

చరణ్‌ (Mega Power Star Ram Charan Tej) తనకు మంచి స్నేహితుడని చెప్పిన కేటీఆర్‌, ‘రంగస్థలం’ సినిమా గురించి తొలుత విన్నాక, అర్బన్‌ బాడీ లాంగ్వేజ్‌తో వుండే చరణ్‌.. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఎలా చేయగలడా? అన్న సందేహం వ్యక్తం చేశాననీ, సినిమా చూశాక చరణ్‌ నటన చూసి ఆశ్చర్యపోయాననీ, ‘రంగస్థలం’లో చరణ్‌ కెరీర్‌ బెస్ట్‌ మూవీ అనీ అభిప్రాయపడ్డారాయన.

చరణ్‌, రాజకీయాల్లో రాణించే సత్తా వున్నోడంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించడంతో పక్కనే వున్న చిరంజీవి కూడా ఆశ్చర్యపోయారు.

మెగా మాస్‌ ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Taraka Rama)

చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా గతంలో వచ్చిన ‘గ్యాంగ్‌లీడర్‌’ తరహా సినిమా ఇదట. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా చెప్పారు. ఆ కథతో సంబంధం లేదుగానీ, ఆ సినిమాలోలా కుటుంబాన్ని కాపాడే యువకుడి కథ అని చిరంజీవి ఇచ్చిన హింట్‌తో, ఈ సినిమాపై ఇప్పటిదాకా విన్పిస్తోన్న ‘గ్యాంగ్‌లీడర్‌’ గాసిప్స్‌కి ఇంకాస్త బలం చేకూరినట్లయ్యింది. చరణ్‌, ఈ సినిమాలో చెప్పిన డైలాగుల్ని వేదికపై చిరంజీవి చెప్పడంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రానికీ డీవీవీ దానయ్యే నిర్మాత. ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆ సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకు వస్తుందన్నది మాత్రం చిరంజీవి చెప్పలేదు. ఆ కాంబినేషన్‌ని చరణ్‌ ప్లాన్‌ చేశాడట.

జనసేనానికి (Jana Sena Party) కేటీఆర్‌ విషెస్‌

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తిరిగి సినిమాల్లో నటించాలనీ, అదే సమయంలో రాజకీయాల్లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (Vinaya Vidheya Taraka Rama). ఈ మధ్యకాలంలో రెండు మూడుసార్లు పవన్‌, తాను మాట్లాడుకున్నామని కూడా ఆయన చెప్పారు.

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ అభిమానులు, జనసేన (Jana Sena Party) జెండాలతో కన్పించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ (Telanga Rashtra Samithi), జనసేన కలిసి పనిచేయాలని వారంతా ఆకాంక్షించారు.

బాబాయ్‌ కష్టమంతా ప్రజల కోసమేనన్న అబ్బాయ్‌

సినిమాలు వదిలేసి, సినిమాల ద్వారా వచ్చే డబ్బు, పేరు ప్రతిష్టలూ పక్కన పెట్టి, జనంలోకి వెళ్ళి కష్టపడుతున్న బాబాయ్‌ని చూస్తే తమ కుటుంబానికి అది బాధ కలిగిస్తోందనీ, అయితే కష్టాల్లో వున్నవారికోసమే బాబాయ్‌ పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) తపన పడుతున్నారు గనుక, ఆయన్ని చూసి తామంతా గర్వపడుతున్నామని చరణ్‌ (Mega Power Star Ram Charan Tej) చెప్పాడు. రాజకీయాల్లో బాబాయ్‌ ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షించాడు చరణ్‌.

కేటీఆర్‌, చిరంజీవి బెంచ్‌ మేట్స్‌

కేటీఆర్‌ వయసెక్కడ.? చిరంజీవి వయసెక్కడ.? ఈ ఇద్దరూ బెంచ్‌ మేట్స్‌ ఏంటి! అంటే, దానికీ ఓ లెక్కుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కేటీఆర్‌, చిరంజీవి శాసనసభ్యులుగా పనిచేశారు. అలా చిరంజీవి, కేటీఆర్‌ బెంచ్‌మేట్స్‌ అయ్యారన్నమాట.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group