అత్యద్భుతమైన అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. అత్యద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరుకున్న టీమిండియా, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యింది.. అదీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (Virat Kohli Always King of Team India) టైటిల్ వేటలో చేతులెత్తేసింది. సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేని పరాజయమిది. ఇందులో వేరే మాటకు తావు లేదు.
కానీ, ఇది కూడా ఓ మ్యాచ్ మాత్రమే. ఆట అన్నాక గెలుపోటములు సహజం. పైగా, టీమిండియా.. ఇద్దరు ప్రత్యర్థులతో పోటీ పడాల్సి వచ్చింది. ఒకటి వర్షం.. ఇంకోటి న్యూజిలాండ్ జట్టు. నిజానికి, న్యూజిలాండ్ కూడా టీమిండియాతోపాటు వర్షంతో పోటీ పడింది. కానీ, సొంత గడ్డ.. న్యూజిలాండ్ జట్టుకి అదనపు బలం.
Also Read: Sachin Tendulkar.. ఈ క్రికెట్ దేవుడికి.. సాటెవ్వడు.!
విదేశీ గడ్డ మీద విజయం సాధించి వుంటే.. ‘కప్పు’ దక్కించుకుని వుంటే.. కోహ్లీ సేనని ఈపాటికి ఆకాశానికెత్తేసేవాళ్ళం.. కరోనా సంగతెలా వున్నా.. ఊరూ వాడా ర్యాలీలు తీసేవాళ్ళం. నిజానికి.. గెలిచినా, ఓడినా.. టీమిండియాని అభిమానించగలిగినప్పుడే.. మనం నిఖార్సయిన క్రికెట్ అభిమానులమవుతామన్న విషయాన్ని ఎంతమంది ఒప్పుకోగలం.?
నిజమే, టీమిండియా తన స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేదు. బౌలింగ్, బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ విభాగంలోనూ టీమిండియా ఆటగాళ్ళలో తప్పిదాలు కనిపించాయి. కానీ, ఇవే తప్పిదాలు టీమిండియా గెలిస్తే కనిపించవంటే ఎలా.? అందివచ్చిన అత్యద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాం గనుక.. చూస్తున్న మనకి బాధ కలగడం సహజం. కానీ, ఆడుతున్న ఆటగాళ్ళకు ఇంకెంత బాధగా వుంటుంది.?
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
వెంటనే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసెయ్యాలనే డిమాండ్లు పెరుగుతున్నాయ్. జట్టు ఓడిన ప్రతిసారీ నాయకుడ్ని మార్చేస్తే.. (Virat Kohli Always King of Team India) అది టీమిండియా ఎలా అవుతుంది.?