టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా అత్యల్ప స్కోరు సాధించింది. 2020 డిసెంబర్ 19.. క్రికెట్‌ని ఇష్టపడే భారతీయులెప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే, ఈ రోజు అతి చెత్త రికార్డ్‌ని విరాట్ కోహ్లీ (Virat Kohli Greatest Failure) నేతృత్వంలోని టీమిండియా సొంతం చేసుకుంది.
ఓ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది కోహ్లీ సేన. జస్ట్ 36 పరుగులకే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. జట్టులో ఒక్క సభ్యుడూ రెండంకెల స్కోరు చేరుకోకపోవడం మరో చెత్త రికార్డ్. మొబైల్ నెంబర్ ఎంత.? అని అడిగినట్టుంది.. టీమిండియా బ్యాట్స్‌మెన్ సాధించిన పరుగులు చూస్తే.
ఇంత ఘోరమా.? అని 130 కోట్ల మంది భారతీయులు ముక్కున వేలేసుకునేలా.. చరిత్రలో చెరిగిపోని చెత్త రికార్డ్ తన పేరిట రాసేసుకున్నాడు కెప్టెన్ కోహ్లీ. పాపం, విరాట్ కోహ్లీ మాత్రం ఏం చేస్తాడు.? టీమిండియాకి ఇంతటి పరాభవం రాసిపెట్టి వుంది మరి.
జానికి, ఆస్ట్రేలియా బౌలింగ్ మరీ గొప్పగా ఏమీ లేదు. ఎందుకంటే, సాధారణమైన బంతులే విసిరారు ఆస్ట్రేలియా బౌలర్లు. తప్పంతా మన బ్యాట్స్‌మెన్‌దే. ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజ్‌లో కాస్సేపు వుండేందుకు ఇష్టపడలేదు. బంతిని, బ్యాట్‌తో కొట్టడం అనవసరం.. అనుకున్నారో ఏమో.
అసలు గ్రౌండ్‌లోకి ఎందుకొచ్చాం మొర్రో.. అంటూ ఏడుపు మొహం పెట్టినట్లే కనిపించారు బ్యాట్స్‌మెన్ అంతా. ఎవరూ ఊహించని నష్టమే జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టుపై ఆధిక్యం.. అదీ ఆస్ట్రేలియాలో సాధించడం గొప్ప విషయమే. ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోకపోవడం మాత్రం స్వయంకృతాపరాధమే. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది టీమిండియా.
ఇలాంటి అవకాశం మళ్ళీ రాదా.? అంటే, అది వేరే చర్చ. టీమిండియాని ఇంత ఘోరంగా ఓడించే ఛాన్స్ బహుశా ఏ జట్టుకీ ఇకపై రాకపోవచ్చేమో. ఎందుకంటే, టీమిండియాకి ఈ పరాజయం ఎప్పటికీ ఓ గుణపాఠంలా మిగిలిపోతుంది. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ వున్నారు భారత జట్టులో.
హార్డ్ హిట్టింగ్, అదీ టీ20 తరహాలో చేసినా, వన్డేల్లోలా ఆడినా.. బావుండేది. కనీసం ఓ వంద నుంచి రెండొందల పరుగులు అయినా చేసేవాళ్ళే. అసలు ఆ ఛాన్స్ ఆస్ట్రేలియా బౌలర్లు భారత్‌కి ఇవ్వలేదని ఎవరైనా అనొచ్చుగాక. శ్రమ పడాల్సిన అవసరం ఆస్ట్రేలియా బౌలర్లకు భారత బ్యాట్స్‌మెన్ ఇవ్వలేదు.
అత్యద్భుతమైన బంతులు విసిరి, భారత బ్యాట్స్‌మెన్‌ని ఆస్ట్రేలియా బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టి వుంటే అది వేరే అంశం. కానీ, అలా జరగనే లేదు. ఎంత నెత్తి బాదుకున్నా, కోహ్లీ సేన ఇలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కావడంలేదు.
క్రికెట్‌లో టీమిండియాకి (Virat Kohli Greatest Failure) ఇదొక దుర్దినం.! ఇంతకు మించి ఏమీ అనలేం. ఎందుకంటే, కెప్టెన్ కోహ్లీ టీమిండియాకి ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు. కానీ, మిగతా ఆటగాళ్ళని మాత్రం నిందించకుండా వుండలేం. అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేని పృధ్వీ షా.. తదితరులు.. టీమిండియాకి ఈ రోజు మరనశాసనం రాసేశారంతే.