కింగ్ కోహ్లీ.! పరుగుల మెషీన్.! కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి. కానీ, కెరీర్‌లో చాలామంది ఆటగాళ్ళు ఎదుర్కొన్న బ్యాడ్ ఫేజ్.. విరాట్ కోహ్లీని కూడా ఇబ్బంది పెట్టింది.
ఔను, కింగ్ కోహ్లీ పనైపోయిందని చాలామంది అనుకున్నారు. క్షణం తీరిక లేకుండా క్రికెట్ ఆడుతూనే వుంటే, ఎప్పుడో ఒకప్పుడు అలసట తప్పదు. విరాట్ కోహ్లీ ఇందుకు అతీతమేమీ కాదు.
కాకపోతే, ‘ఆటిట్యూడ్’ విరాట్ కోహ్లీ కొంప ముంచింది. సహచర ఆటగాళ్ళతో కమ్యూనికేషన్ గ్యాప్, విరాట్ కోహ్లీని వివాదాల్లోకి నెట్టింది. ఫామ్ కోల్పోవడం ఆయన్ని మరింతగా విమర్శల పాలు చేసింది.
Virat Kohli.. గతం గతః దూసుకొచ్చేశాడంతే..
కొట్టాడు.. చాలా చాలా గట్టిగా కొట్టాడు.! 82 పరుగులు చేసి, టీమిండియాకి అపూర్వమైన విజయాన్ని అందించాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది.
అచ్చం ఇలాంటి ఇన్నింగ్స్ గతంలో వరల్డ్ కప్ టోర్నీలోనే, ఆస్ట్రేలియా మీద ఆడాడు కోహ్లీ. కానీ, ఇప్పుడిది వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే, గెలిచింది మామూలు ప్రత్యర్థఇ మీద కాదు.!

ఆ గెలుపు దాయాది పాకిస్తాన్ మీద.. అందునా, టీ20 వరల్డ్ కప్‌లో.! వావ్, విరాట్ కోహ్లీ ఏం కొట్టాడు.? కొత్త టెక్నిక్స్ వాడాడు.. సరికొత్త షాట్లు ఆడాడని అంటున్నారంతా.
నిజానికి, విరాట్ కోహ్లీ కొత్తగా ఆడలేదు. కాకపోతే, మునుపటి కమిట్మెంట్ చూపించాడంతే. మునుపటి ఫామ్ కనబరిచాడంతే.!
గెలిచి.. గెలిపించి..
టైమ్ కలిసొస్తే, టెయిలెండర్ కూడా జట్టుకి అత్యద్భుత విజయాన్ని అందించేయగలడు.! అదే క్రికెట్ మ్యాజిక్. టీ20లో ఇలాంటి అద్భుతాల్ని చాలానే చూస్తుంటాం.
అలాగని, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి తక్కువ చేసి మాట్లాడగలమా.? విరాట్ కోహ్లీ అంటేనే రన్ మెషీన్. అత్యద్భుతమైన టెక్నిక్ వున్న ఆటగాడు.
ఛేదనలో ఎప్పుడూ విరాట్ కోహ్లీ కసితో చెలరేగిపోతూనే వుంటాడు. ఆయన ఖాతాలో ఇది మరో గొప్ప ఇన్నింగ్స్ అంతే. ఇలాంటివి చాలానే వున్నాయ్. దేనికదే స్పెషల్.
Also Read: Megastar Chiranjeevi స్థాయి.. ప్రవచన ‘పేడ’కెలా తెలుస్తుంది.?
ఇంతకీ, విరాట్ కోహ్లీ ఎందుకు కంటతడి పెట్టినట్లు.? మ్యాచ్ అలాంటిది. విరాట్ కోహ్లీ ప్రస్తుత పరిస్థితి అది.! టీమిండియాకి ఈ విజయం ఎంత అవసరమో కోహ్లీకి తెలుసు.. కెప్టెన్ రోహిత్ శర్మకీ తెలుసు.
హేట్సాఫ్ కింగ్ కోహ్లీ.!