చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఓటమి పాలయ్యింది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Virat Kohli Stunning Show) సత్తా చాటింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈ రోజు మ్యాచ్ నిజంగానే ఓ అద్భుతం. ఎందుకంటే, అక్కడ తలపడుతున్నది టీమిండియా మాజీ కెప్టెన్.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన ధోనీ, చాలా గ్యాప్ తర్వాత ఐపీఎల్ ద్వారా మైదానంలోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్‌లో ధోనీ నుంచి అద్భుతాలు ఆశించారు చెన్నయ్ సూపర్ కింగ్స్ అభిమానులతోపాటు, సగటు క్రికెట్ అభిమానులు కూడా.
కానీ, ధోనీ నుంచి అద్భుతాలు కనిపించడంలేదు. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు వరుస వైఫల్యాల్ని చవిచూస్తోంది. మరోపక్క, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. నిలకడగా రాణిస్తోంది. చెన్నయ్ మీద బెంగళూరు విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
కోహ్లీ ఈ సీజన్‌లో తొలుత పెద్దగా రాణించకపోవడంతో చాలా విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లీ మీదనే కాదు, కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మీద కూడా జుగుప్సాకరమైన కామెంట్లు వచ్చిపడ్డాయి. ఎవరైతే కోహ్లీని మొదట్లో విమర్శించారో.. ఇప్పుడు వాళ్ళే అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇదిలా వుంటే, చెన్నయ్ సూపర్ కింగ్స్ గాడిన పడాల్సి వుంది. మరీ ముఖ్యంగా ధోనీ సత్తా చాటాల్సి వుంది. దురదృష్టమేంటంటే, ధోనీ వైఫల్యానికి.. అతని కుమార్తెని వివాదాల్లోకి లాగుతున్నారు.. అత్యంత జుగుప్సాకరంగా ధోనీ కుమార్తె జీవా మీద సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
అంతిమంగా క్రికెట్ అనేది జస్ట్ ఓ ఆట మాత్రమే. తనదైన రోజున ధోనీ సత్తా చాటితే.. మళ్ళీ అతన్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు.. ఈ హేటర్సే. ఏదిఏమైనా, విరాట్ కోహ్లీ బ్యాట్‌తో పరుగుల వరద పారించేయడంతో క్రికెట్ అభిమానులకు నిజంగానే పెద్ద పండగలా అనిపించింది.
ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై నిజానికి పెద్దగా అంచనాల్లేవు. కోహ్లీ (Virat Kohli Stunning Show) ఇదే జోరు కొనసాగిస్తే, బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో అద్భుతాలు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.