Virushka Vamika Kohli.. ఏం చేస్తే పబ్లిసిటీ వస్తుంది.? ఎలా వ్యవహరిస్తే పాపులారిటీ పెరుగుతుంది.? అన్న విషయాలపై అటు క్రికెటర్లకీ, ఇటు సినీ తారలకీ సంపూర్ణ అవగాహన వుంటుంది. అలా అవగాహన లేకపోతే, సెలబ్రిటీలుగా రాణించడం కష్టమే. ఎందుకంటే, సెలబ్రిటీ స్టేటస్ ఆధారపడి వున్నదే పబ్లిసిటీ స్టంట్ల వల్ల అన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయిన రోజులివి.
విషయమేంటంటే విరుష్క.. అదేనండీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజాగా, తమ కుమార్తె వామిక విషయమై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అందులో, ‘వామిక’ ఫొటో వైరల్ అవడంపై ఆవేదన వ్యక్తం చేసింది విరుష్క జంట.
Virushka Vamika Kohli.. విరుష్క వామిక.. గోప్యత సాధ్యమేనా.?
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల గారాల పట్టి వామిక విషయంలో కొంత గోప్యత కనిపిస్తోంది. ఎంత సెలబ్రిటీలైతే మాత్రం, వారికి ప్రైవేట్ లైఫ్ వుండదా.? ప్రైవసీ కోరుకోకూడదా.? అలా తమ బిడ్డ ఫొటోలు బయటకు రాకుండా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జాగ్రత్త పడుతున్నారు. కానీ, వామిక ఫొటోలు బయటకు వచ్చేశాయ్.

మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలూ వామిక ఫొటోల్ని వైరల్ చేసి పారేశాయి. బ్రేకింగ్ న్యూసులు, పత్రికల్లో హెడ్‌లైన్స్ రూపంలో వామిక ఫొటోలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఈ వ్యవహారంపై విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె వామిక ఫొటోల్ని వైరల్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది విరుష్క జంట.
సోషల్ మీడియా యుగమిది.!
ఇండియా – సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా అనుష్క శర్మ, వామికల వైపు కెమెరా తిరిగింది. దాంతో, వాళ్ళిద్దరూ బిగ్ స్క్రీన్ మీద కనిపించారు.. అది లైవ్ కాస్ట్ అయ్యింది గనుక, ఆ వీడియో ప్రపంచమంతా చూసేసింది. సోషల్ మీడియాలోనూ అవి వైరల్ అయ్యాయి.
‘అలా అవుతుందని మాకు తెలియదు. కెమెరా మా వైపు వున్న సంగతిని గుర్తించలేకపోయాం..’ అంటూ వామిక విషయమై విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అనుష్కదీ ఇదే మాట. మ్యాచ్ చూడటానికి వచ్చినప్పుడు, వీడియో కెమెరాలు మొత్తం అన్ని విషయాల్నీ కవర్ చేస్తుందని విరాట్, అనుష్క.. ఇద్దరూ గుర్తించలేకపోవడం ఆశ్చర్యకరమే.
Also Read: అయ్యయ్యో వద్దమ్మా.! జాక్వెలైన్ గోలేంటమ్మా.?
ఒక్కటి మాత్రం నిజం.. అనుష్క, విరాట్ ‘వద్దు’ అంటున్నారు గనుక, వామిక కోహ్లీకి సంబంధించిన (Virushka Vamika Kohli) ఆ ఫొటోల్ని వైరల్ చేయకపోవడమే మంచిది.
కానీ, అటు విరాట్ కోహ్లీ, ఇటు అనుష్క శర్మ.. ఇద్దరూ సెలబ్రిటీలే కదా.. వారి కుమార్తె వామిక గురించి తెలుసుకోవాలని ఎవరికి మాత్రం వుండదు.? ఇది సోషల్ మీడియా యుగం. ఇక్కడ దేన్నీ దాచలేం.!