Vishal పవన్ కళ్యాణ్ అంటే అభిమానమట.! తెలుగులో మల్టీస్టారర్ చేస్తే, పవన్ కళ్యాణ్‌తో చేయాలట. పవన్ కళ్యాణ్ అభిమానులనే కుటుంబంలో తననూ సభ్యుడిగా చేర్చుకోవాలని అంటాడట.!
మరి, అంతలా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ప్రేమ, అభిమానం వుంటే.. ఓటు కూడా పవన్ కళ్యాణ్‌కే వెయ్యాలి కదా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంటే, కేవలం.. ఆయన్ని సినీ నటుడిగా అభిమానించేవాళ్ళే కాదు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేవాళ్ళు కూడా.
Vishal ఈ అభిమానం.. చాలా చాలా ప్రత్యేకం..
ఓ సినిమా నటుడ్ని అభిమానించే అభిమానులంతా దానికి ‘ఇజం’ అని ఓ పేరు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్‌తోనే ప్రారంభమయ్యింది.
అంటే, అది కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానం మాత్రమే కాదు.. అంతకు మించి.! పవన్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడేవాళ్ళే ఈ ‘ఇజం’ని ఫాలో అయ్యారు.
‘మేం పవన్ కళ్యాణ్ అభిమానులం’ అని గర్వంగా చెప్పుకునేవాళ్ళెవరైనా, పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఇష్టపడటమే కాదు, పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగునీ ఇష్టపడతారు.. అది రాజకీయం అయినాసరే.!
పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దెబ్బకొట్టడానికే..
ఓటు వెయ్యడం అనేది ఆయా వ్యక్తుల ఇష్టం. ఇందులో ఇంకోమాటకు తావు లేదు. ఇది ప్రజాస్వామ్యం.. ఎవరిష్టం వాళ్ళది.
కానీ, పవన్ కళ్యాణ్‌ని ఇష్టపడి, ప్రేమించి, అభిమానంతో వుండేవారు జనసేన పార్టీని కాదని ఇంకో పార్టీకి ఓటేసే ప్రసక్తి మామూలుగా అయితే వుండదు.
Also Read: ఐటమ్ భామల కొట్లాట: జాక్వెలైన్ వర్సెస్ నోరా ఫతేహీ.!
ఆ అభిమానుల్లో చీలిక తెచ్చే ప్రయత్నమా.? అభిమానం వేరు.. రాజకీయం వేరనే సంకేతాలు ప్రజల్లోకి పంపడం ద్వారా జనసేనకు చేటు చేయాలనే ఉద్దేశ్యమా.?
ఇంతకీ, విశాల్ ఆలోచన ఏంటి.? ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి.?
ఇంతకీ, విశాల్ చుట్టూ ఏపీ రాజకీయం.. అన్నట్లుగా ఆయన వైసీపీ నుంచి పోటీ చేయడంపై అంత చర్చ ఎందుకు జరిగినట్లు.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.