Vishwak Sen Publicity Stunt.. యంగ్ హీరో విశ్వక్ సేన్ ముందే చెప్పేశాడు, తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడానికి పబ్లిసిటీ స్టంట్లు చేస్తానని.!
‘ఫలక్‌నుమా దాస్’ సినిమా దగ్గర్నుంచి, ప్రతి సినిమాకీ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే వున్నాడీ యంగ్ హీరో.
కేవలం వివాదాలతోనే సినిమాలు గట్టెక్కేస్తాయనుకుంటే, విశ్వక్ సేన్ ఓ సారి రామ్ గోపాల్ వర్మ ఎదిగి, దిగజారిపోయిన తీరుని విశ్లేషించుకోవాల్సి వుంటుంది.
తాను చేస్తున్న సినిమాల్లో కంటెంట్ వుంటేనే, విశ్వక్ సేన్ ఆయా సినిమాల ప్రమోషన్ కోసం ఎన్ని పాట్లు పడినా అవి కలిసొస్తాయ్. లేదంటే, అంతే సంగతులు.
Viswak Sen Publicity Stunt.. ప్రాంక్ అండ్ పబ్లిసిటీ.!
ప్రాంక్ చేశాడు.. కావాలనుకున్న పబ్లిసిటీ పొందాడు. ఈ క్రమంలో అసలు ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమా గురించి జనం మాట్లాడుకోవడమే మానేశారు. దాంతో, మళ్ళీ అభిమానుల్ని బతిమాలుకోవడం మొదలెట్టాడు.
‘మీరు లేకపోతే నేను లేనురా బై..’ అంటూ అభిమానుల్ని తన వైపుకు తిప్పుకునేందుకు విశ్వక్ సేన్ పడరాని పాట్లూ పడుతున్నాడు.
ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో విశ్వక్ సేన్ చేసిన హంగామా కూడా కేవలం పబ్లిసిటీ స్టంటేనా.? అని ఇప్పుడంతా అనుకోవాల్సి వస్తోంది.
ఇంతలా దేబిరించాలా.?
అవును మరి, అంతకు మించిన స్థాయిలో అభిమానుల్ని విశ్వక్ సేన్ దేబిరిస్తున్న వైనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు.
తగ్గేదే లే.. అంటాడు, తగ్గిపోతాను లే.. అంటాడు.! ఏంటో ఈ విశ్వక్ సేన్ (Vishwak Sen) వ్యవహార శైలి.? అది అతని అభిమానులుగా చెప్పబడ్తోన్న ఆ కొద్ది మంది యూత్‌కే అర్థం కాని పరిస్థితి.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
సింపుల్‌గా చెప్పాలంటే ట్రాన్స్‌లో వున్న కొందర్ని తన అభిమానులుగా విశ్వక్ సేన్ పరిచయం చేసుకుంటున్నాడు.. వాళ్ళే అతనికి గుడ్డిగా మద్దతిచ్చేస్తున్నారు కూడా.!
అప్పట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండని కెలికి, ఆ తర్వాత సారీ చెప్పిన విశ్వక్ సేన్, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రిలీజ్ తర్వాత అదే స్థాయిలో దిగి వస్తాడా.? ఆల్రెడీ దిగొచ్చేసినట్టే.!