Wamiqa Gabbi Bhale Manchiroju.. అప్పుడెప్పుడో ‘భలే మంచి రోజు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ వామికా గబ్బి. సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించాడు.
ఈ సినిమా తర్వాత వామికా గబ్బి మళ్లీ తెలుగులో కనిపించింది లేదు. చేసింది ఒక్క సినిమానే అయినా వామిక మాత్రం తనదైన ఆటిట్యూడ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.
ఎక్కువగా పంజాబీ సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ బాగానే కనిపించిందీ పంజాబీ బ్యూటీ వామిక గబ్బి.
Wamiqa Gabbi Bhale Manchiroju.. అబ్బో.! పాప బాగా బిజీ..!
ఈ మధ్య ఓటీటీ పుణ్యమా అని, ఆయా భాషా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరైపోయింది వామికా గబ్బి. ఎక్కువగా వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తోంది.
వెబ్ సిరీస్‌లతో వామిక నటనకు ఓటీటీ ఆడియన్స్ షాక్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. మంచి టాలెంట్‌డ్ ముద్దుగుమ్మని తెలుగు మేకర్లు పట్టించుకోవడం లేదే అని ఫీల్ అవుతున్నారు కూడా.

వామిక గబ్బి మంచి డాన్సర్. కథక్ నృత్యంలో మంచి పట్టుందీ ముద్దుగుమ్మకి. అలాగే, ఎలాంటి బరువైన పాత్రనైనా హ్యాండిల్ చేయగల సత్తా కూడా వుంది.
‘జూబ్లీ’ అనే వెబ్ సిరీస్‌లో రీల్ లైఫ్ హీరోయిన్ పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పర్‌ఫామెన్స్‌తో కట్టి పడేసింది వామిక గబ్బి.
తెలుగులో సినిమాలు చేయడం లేదు కదా.. అని వామిక ఖాళీగా వుందనుకునేరు. ఓ వైపు వెబ్ సిరీస్‌లు, మరో వైపు షార్ట్ ఫిలింస్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది.
ఇంత బిజీలోనూ తగ్గేదే లే.!
అలాగే తమిళంలో ‘జీనీ’ అనే సినిమాలో నటిస్తోంది. పంజాబీలో ఓ సినిమా, హిందీలో ఇంకో సినిమా.. ఇలా పెద్ద తెర ప్రాజెక్టులతోనూ బిజీగానే గడుపుతోంది.
Also Read : Mummy Cat Baby Monkey: పిల్లి కడుపున కోతి! జీవన సిత్తరం!
ఇవన్నీ ఓ ఎత్తయితే, మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ ఎప్పటి కప్పుడు సందడి చేస్తుంటుంది. ఇంతేనా.! సోషల్ మీడియాలో అమ్మడి దూకుడు అంతా ఇంతా కాదు.

తనదైన అందాల ఆరబోతతో సోషల్ మీడియాని హీటెక్కించడంలో వామిక గబ్బి స్పెషల్ డిగ్రీ చేసేసిందండోయ్. తాజాగా కొన్ని హాట్ పోజులు నెట్టింట్లో సందడి చేస్తున్నాయ్.
ఎందుకాలస్యం.. కుర్రకారును కిర్రాకెత్తించేలా వున్న వామిక (Wamiqa Gabbi) ఈ హాట్ ఫోటోస్‌పై మీరూ ఓ లుక్కేస్కోండిక.!