Table of Contents
హైట్ పెరగాలంటే, కింద కాళ్ళని ఏదన్నా బలమైన వస్తువుకి కట్టేసి, నెత్తికి ఓ తాడు కట్టుకుని.. ఆ తాడుని ఏదన్నా క్రేన్‌కి తగిలించి.. పైకి లాగేస్తే ఎలా వుంటుంది.? దెబ్బకి చచ్చి ఊరుకుంటాడు మనిషి. టెక్నాలజీ పైత్యం (Weight Loss Technology Locking Teeth) ఇలాగే వుంటుంది.
కొన్నాళ్ళ క్రితం హైద్రాబాద్ నగరంలోనే ఓ యువకుడు హైట్ పెంచుకునేందుకోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిని సందర్శిస్తే, సర్జరీ నిర్వహించిన వైద్యులు.. ఆ యువకుడి జీవితాన్నే నాశనం చేసేశారు. హైట్ పెరగలేదు సరికదా.. కాళ్ళకు ఇన్ఫెక్షన్ సోకి.. మంచానికి పరిమితైపోవాల్సి వచ్చింది ఆ యువకుడు చాన్నాళ్ళపాటు.
Also Read: Fashion ICON: Sonam Kapoor.. గ్లామర్.. అంతకు మించి.!
ఇదిగో, ఇప్పుడు సన్నబడేందుకోసమంటూ సరికొత్త విధానం సృష్టించిన శాస్త్రవేత్తలు, తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. నోట్లో.. దంతాలకు మ్యాగ్నెటిక్ విధానం ద్వారా పనిచేసే క్లిప్స్ అమర్చుతారట.. పైన పంటికీ, కింది పంటికీ విడివిడిగా క్లప్పులు అమర్చడం, ఆ తర్వాత వాటిని ఓ రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తే.. నోరు తెరవడానికి వీల్లేకుండా ఆ మ్యాగ్నెట్స్ అతుక్కుపోవడం.. ఇదీ అసలు టెక్నాలజీ.
ఈ టెక్నాలజీతో మాట్లాడేందుకు ఇబ్బంది వుండదట. తేలికపాటి ద్రవాహారం తీసుకోవడానికీ సమస్య వుండనే వుండదట. కానీ, నమిలేందుకు వీలుగా మాత్రం నోరు తెరవబడదు.
Also Read: విద్యాబాలన్ ఫ్యాషన్ మంత్ర: బోల్డ్ అండ్ బ్యూటిఫుల్.!
అంతలా మనల్ని మనం ఎందుకు శిక్షించుకోవాలి.? తినకూడని ఆహార పదార్థాల్ని కాస్త దూరం పెట్టేలా, మన మనసుని అదుపులో పెట్టుకుంటే సరిపోద్ది కదా.? రోజూ వ్యాయామం చేస్తే సరిపోతుంది కదా.? తిన్నది అరిగేదాకా (Weight Loss Technology Locking Teeth) పని చేసుకుంటే సమస్య వుండదు కదా.?
అలా సహజ పద్ధతుల్లో ఒళ్ళు తగ్గించేసుకుంటే, శాస్త్ర సాంకేతిక రంగాలకు పనేముంటుంది.? అక్కడే వుంది మరి మ్యాజిక్. శాస్త్రం కొత్తగా ఏదన్నా కనిపెడితే.. అది జనం మెచ్చేలా వుండాలి. జనం ఛీత్కరించేలా వుండకూడదు. కానీ, ఇలాంటి ఛీత్కరించుకోవాల్సిన విషయాలకే విపరీతమైన పబ్లిసిటీ లభిస్తోంది మరి.
Also Read: 5G నెట్‌వర్క్ రేడియేషన్ హానికరమా.?
చర్మం తెల్లగా రావాలంటే, పైన వున్న నల్లటి చర్మాన్ని ఒలిచేసుకోవాలనే దిశగా కూడా చికిత్సలు వచ్చేస్తాయేమో ముందు ముందు. బరువు తగ్గేందు కోసం ఒకప్పుడు లైపోసక్షన్ చికిత్స విరివిగా వాడేవారు. ఆ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా.
బేరియాట్రిక్ శస్త్ర చికిత్సలు ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. అవీ నానా అనర్థాలకూ కారణమవుతున్నాయి. కానీ, ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కావాలనుకునేవారు ప్రాణాల్ని సైతం లెక్క చేయడంలేదంతే.