Akshay Kumar.. కీలెరిగి వాత పెట్టాలన్నది వెనకటికి పెద్దలు చెప్పిన మాట. అంటే, రోగం ఎక్కడుందో తెలుసుకుని, దానికి మందు వేయాలి. కానీ, ఇప్పుడు జరుగుతున్నది వేరు.!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందుకే, మద్యం బ్రాండ్లకు సంబంధించి ఎలాంటి ‘పబ్లిసిటీ’ వుండకూడదట.
మద్యపానం ఆరోగ్యానికి హానికరమైనప్పుడు, దాన్ని ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నట్టు.? ఇలాక్కదా చర్చ జరగాల్సింది.?
పొగాకు ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం అనైతికమట. పొగాకు కూడా ఆరోగ్యానికి హానికరమే. కానీ, దాన్ని సైతం ప్రభుత్వాలు బ్యాన్ చేయవు. సెలబ్రిటీలు మాత్రం నైతికత కోణంలో వాటికి ప్రచారం చేయకూడదు.
అసలు సమస్యే ఇది.! పొగాకు కావొచ్చు, మద్యం కావొచ్చు.. మరొకటి కావొచ్చు.. అది హానికరమైనప్పుడు, దానిపై నిషేధం విధిస్తే సరిపోతుంది కదా.?
అయ్యయ్యో అక్కీ.. ఇలా బుక్కయిపోయావేంటీ.?
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ఓ పాన్ మసాలా ప్రకటనలో నటించాడు.. దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు.
‘ఇదేం నైతికత.?’ అని అంతా ప్రశ్నించేసరికి, చేసేది లేక.. ‘ఇకపై అలాంటివి చేయను’ అంటూ క్షమాపణ కూడా చెప్పాడు అక్షయ్ కుమార్.
‘పాన్ ఇండియా హీరోలు వీళ్ళు.. పాన్ మసాలా హీరోలు వీళ్ళు..’ అంటూ అనవసరపు రచ్చ సినిమాల పరంగా బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా మధ్య షురూ అయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.
ఆ పాన్ మసాలా హీరోల్లో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Maheshbabu) కూడా వున్న విషయాన్ని కొందరు విస్మరిస్తున్నారు.
Akshay Kumar మీద విరుచుకుపడితే ఏమొస్తుంది.?
పాన్ మసాలా ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించొద్దని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయడం కాదు.. అసలంటూ ఆ పాన్ మసాలా విక్రయాలే లేకుండా చేయాలని ప్రజా పోరాటాలు జరగాలి.
Also Read: Ester Noronha.. సంస్కారమట.. ‘బోల్డు’గానే సెప్పాలట.?
పాన్ మసాలా మాత్రమే కాదు, మద్యం అలాగే ప్రజారోగ్యానికి హానికరమయ్యే వాటన్నిటినపైనా నిషేధం దిశగా నినదించాలి. కానీ, అలా జరగదుగాక జరగదు.! అదంతే.