తెలుగు సినీ పరిశ్రమలో లేడీ సింగర్స్ చాలామందే వున్నారు. కానీ, సింగర్ సునీత (Singer Sunitha Befitting Reply To Trolls) సమ్‌థింగ్ స్పెషల్. ఆమె వాయిస్ చాలా చాలా ప్రత్యేకం. బోల్డంత ఫాలోయింగ్ ఆమె సొంతం. దురదృష్టమేంటంటే, ఆ ఫాలోయింగ్ ఆమెకు ఇబ్బందికరంగా మారింది.
నిజం, సింగర్ సునీతకి (Singer Sunitha) వున్న ఆ ఫాలోయింగ్ కారణంగానే, ఆమె మీద జుగుప్సాకరమైన పుకార్లను ప్రచారంలోకి తెస్తున్నారు కొందరు.
సునీత మీద ‘నెగెటివ్’ కామెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, డిజిటల్ మీడియాలో వీడియోలు తయారు చేసి పోస్ట్ చేసినా, ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా – వెబ్ మీడియాలో కథనాలు వండి వడ్డించినా, వాటికి బోల్డంత క్రేజ్. అయితే, అన్నటినీ సింగర్ సునీత భరిస్తూ వచ్చింది.
అప్పుడప్పుడూ వాటికి తనదైన స్టయిల్లో సమాధానమిస్తూ వచ్చింది. తాజాగా, ఆమె ట్రోల్స్ చేసేవారికి ఇచ్చిన ‘గిఫ్ట్’ మామూలుగా లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) నేపథ్యంలో సింగర్ సునీత, హార్ట్ టచింగ్ మెసేజ్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నిర్ణయించేది మీరే.. నిందించేదీ మీరే..
‘మీరే నిర్ణయిస్తారు.. మీరే ట్రోల్ చేస్తారు.. మీరే నన్ను కిందకు లాగేస్తారు. నన్ను నేను నిరూపించుకోవాలని సవాల్ విసురుతారు. నన్ను అభద్రతాభావానికి గురిచేస్తారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు సునీత.
‘మీరు నన్ను నమ్మరు. నాకు మద్దతివ్వరు. నేను చెప్పేది వినడానికి కూడా ఇష్టపడరు. నేను కిందకి పడిపోతే నవ్వుతారు. నన్ను అవమానిస్తారు, నిందిస్తారు. అది కూడా ఎలాంటి కారణం లేకుండా.! ఇప్పుడు మీరే నాకు మహిళా దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు చెబుతున్నారు..’ అంటూ సునీత (Singer Sunitha Befitting Reply To Trolls) స్పందించారు.
You judge, you troll, you always try to pull me down,
you want to prove a point, you make me feel insecure,
you don’t trust, you don’t support, you don’t ever hear me,
you laugh when I fail, you suffocate me,
you blame me for no reason and wish me a Happy women’s day!?
Yes! I take it because I pulled up all my strength on my own and built a castle with the same stones you threw at me and rose up above everything!!
I smile, I forgive, I take care, I love, I never give up…
I am a woman…I’m compassionate!!
Happy women’s day!!!
‘అయినాసరే, మీరు అందించిన విషెస్‌ని నేను స్వీకరిస్తున్నాను. నా శక్తినంతా నేను కూడగట్టుకోగలిగాను. మీరు విసిరిన రాళ్ళతో భవంతిని నిర్మించుకున్నాను’ అని పేర్కొన్నారు సునీత.
‘ఇప్పుడు అత్యున్నత స్థానంలో నిల్చున్నాను. నేను నవ్వుతున్నాను. నేను క్షమిస్తాను. ఎప్పటికీ దేన్నీ వదిలిపెట్టను, సాధిస్తాను. నేను ఓ మహిళను.. హ్యపీ విమెన్స్ డే’ అంటూ ముగించారు సింగర్ సునీత (Sunitha Upadrashta).
ఇది కథ కాదు వ్యధ..
నిజానికి, ఇది సునీత కథ మాత్రమే కాదు. చాలామంది కథ. కాదు కాదు.. వ్యధ. విమర్శలకీ హద్దు వుంటుంది. ట్రోలింగ్‌కీ ఓ హద్దు వుంటుంది. సునీత కావొచ్చు.. మరొకరు కావొచ్చు, సెలబ్రిటీలయినంతమాత్రాన, వారికి వ్యక్తిగత జీవితం వుండకూడదనుకుంటే ఎలా.? ఆ వ్యక్తిగత జీవితంలోకి అడ్డగోలుగా తొంగి చూస్తామంటే ఎలా.? అత్యంత హేయంగా మహిళల వ్యక్తిత్వాన్ని కించపర్చేస్తే ఎలా.?
అమ్మ, అమ్మాయి, భార్య, చెల్లి, అక్క.. ఇలా ఎవరైతేనేం, మహిళ (Singer Sunitha Befitting Reply To Trolls) అంటే.. ఆకాశంలో సగం.. కాదు కాదు, అన్నింటా సమానం.. అన్న భావన ప్రతి ఒక్కరిలో పెరిగితే, సాటి మనిషిని వేధించాలన్న ఆలోచనే ఎవరికీ రాదు.