నటి యాషిక ఆనంద్ (Yashika Aannand Accident Confession), ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం విదితమే. ఈ ఘటనలో యాషిక, తన స్నేహితురాల్ని పోగొట్టుకుంది. యాషిక స్నేహితురాలు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోగా, యాషిక ప్రాణాలతో బయటపడ్డంపై పలు అనుమానాలు తలెత్తాయి.
కాగా, ఈ మొత్తం వ్యవహారంపై కాస్త లేటుగా స్పందించింది యాషిక. చిత్రమేంటంటే, ఆమె ఇంకా బెడ్ మీద నుంచి లేచే పరిస్థితి లేదు. సుమారు ఐదు నెలల పాటు బెడ్ రెస్ట్ ఆమెకు తప్పనిసరి. ‘అన్నీ మంచం మీదనే..’ అంటూ యాషిక తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Also Read: మాల్దీవుల్లో అందాల మంట పెట్టేస్తున్నారహో
‘నేను నా స్నేహితురాల్ని పోగొట్టుకున్నాను. దేవుడు నాకు చాలా పెద్ద శిక్ష వేసేశాడు. నా స్నేహితురాల్ని కోల్పోవడానికి నేనే కారణమయ్యానన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంటుంది. నా స్నేహితురాలి కుటుంబ సభ్యుల కళ్ళల్లోకి నేనెప్పుడూ నేరుగా చూడలేను..’ అని సుదీర్ఘ వివరణ ఇచ్చుకుంది యాషిక ఆనంద్.
రోడ్డు ప్రమాదాలు చెప్పి జరగవు. కానీ, చాలా ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతాయి. యాఫిక రోడ్డు ప్రమాదానికి గురవడం వెనుక కూడా నిర్లక్ష్యమే ప్రధాన కారణమా.? అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. పోలీసులు ఈ వ్యవహారంపై పెదవి విప్పలేదు. ‘ఆమె బాగానే మేనేజ్ చేసింది’ అని యాషికపై విమర్శలు వచ్చిపడుతున్నాయి.
Also Read: అన్వేషి జైన్.. ‘ప్లస్ సైజ్’.. అది నా తప్పు కాదు.!
ఇదిలా వుంటే, ఘోర రోడ్డు ప్రమాదం జరిగినా, యాషిక మొహమ్మీద చిన్న ‘గాటు’ కూడా పడలేదట. కానీ, ఆమె వెన్ను భాగానికి తీవ్ర గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్ కూడా ఓ కాలికి జరిగిందనీ, చేతులు, ఇతర భాగాలకూ గాయాలయ్యాయనీ వైద్యులు వెల్లడించారు.
కాగా, సోషల్ మీడియా వేదికగా తన పాపానికి ప్రక్షాళన జరిగిపోయిందన్నట్లుగా యాషిక ఆనంద్ (Yashika Aannand Accident Confession) ఇచ్చిన వివరణపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!