Yellow Saree Dirty Politics.. కడుపుకి అన్నమే తింటున్నావా.? అశుద్ధం తింటున్నావా.? ఔను, ఇలాగే ప్రశ్నించాలని వుంది.! ప్రశ్నించేస్తున్నాం కూడా.!
ఏ అన్న అయినా, తన చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి మాట్లాడతాడా.? ఛీ.. ఛీ.. సిగ్గూ లజ్జా వదిలేస్తే తప్ప, చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి ప్రస్తావిస్తూ విమర్శించడు.!
రాజకీయాల్లోకి వచ్చాక ఎవరైనా సిగ్గూ ఎగ్గూ వదిలేయాల్సిందేనా.? లేదే.! చాలామంది నిబద్ధతతో రాజకీయాలు చేస్తుంటారు కదా.?
Yellow Saree Dirty Politics.. ఏ రంగు చీర కడితే ఏం నష్టం.?
నీలం రంగు చీర కడితే, చెల్లెలు ఉత్తమురాలు.! పసుపు రంగు చీర కడితే, పతివ్రత కాదా.? ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం.?
ఎవరు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారి వారి వ్యక్తిగత విషయం.! అయినా, పసుపు అంటే, అదేమీ నిషేధిత రంగు కాదు కదా.?
ఓహో, ఇంకోసారి అధికారంలోకి వస్తే, మహిళలెవరూ పసుపు రంగు చీర కట్టుకోకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయాలని అనుకుంటున్నావా.?
బహుశా హిట్లర్ కూడా ఈ తరహా ఆలోచనలు చేసి వుండడు.! తుగ్లక్ సైతం, ఇలాంటి పైత్యాన్ని ప్రదర్శించి వుండబోడు.!
ఈ అసహనం దేనికి సంకేతం.?
రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! గెలవకపోతే ఏమయిపోతుందోనన్న భయమే ఇలాంటి విపరీత వ్యాఖ్యలకు కారణమా.?
కాదు కాదు, ఓ మూకని తయారు చేసింది ఆ నయా తుగ్లక్ రాజకీయం. తోడబుట్టిన చెల్లెల్ని తన తండ్రికి వారసురాలు కాదు, ఇంకొకరెవరికో వారసురాలనడం అత్యంత అసభ్యకరం.!
చెల్లితో వదిలిపెడతావా.? తల్లినీ ఇలాగే అంటావా.? కట్టుకున్న భార్య సైతం పసుపు చీర కట్టుకోకూడదని ఇంట్లో నిషేధాజ్ఞలు విధిస్తావా.? కూతుళ్ళ మాటేమిటి.?
Also Read: ఓ ‘పొలిటికల్’ రాయీ.! నిన్నెవరు విసిరారోయీ.!
ఛత్.. ఇదసలు రాజకీయమే కాదు.! ఇదో పైశాచికత్వం.! ఈ శాడిజంకి చికిత్స లేదు.! ఇలాంటి శాడిస్టులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు.! అసలు ఇలాంటి శాడిస్టులకు ఏ కుటుంబంలోనూ చోటుండకూడదు.!
అన్నిటికీ మించి, ఇలాంటి శాడిస్టు, ఏ సోదరికీ అన్నగా పనికిరాడు.! అన్నగా మాత్రమే కాదు, తండ్రిగా, భర్తగా.. ఇలా ఏ కోణంలో చూసినా, దేనికీ పనికిరాడంతే.!
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందో లేదో తెలియదుగానీ, ఇలాంటి శాడిస్టులు లోకం పచ్చగా వుంటే చూసి ఓర్చుకోలేరంతే.!